పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/315

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మురియుచు వారిచేతులు పట్టుకొని పోయి యామఠంబు వేదికపైఁ గూర్చుండి ముచ్చటలాడుకొనుచు నొండొరుల చరిత్ర మొండొరులకుఁ దెలియఁ జేసికొనిరి.

పౌరులు విశేషముగా మూగికొనియుండుటచే నాకు వారి దాపునకుఁబోవ వీలుపడినది కాదు వారాడికొనిన మాటలన్నియు వినఁబడలేదు వినఁబడినవానిం జెప్పెద నాలింపుడ మేము ద్వారవతీనగరంబున నాలుగుదివసంబులుండి శ్రీకృష్ణునిభజించి యింటికింబోవలయు నని ప్రయత్నింపుచుండ జారుమతి తండ్రి యవంతీశ్వరుఁడు తోడల్లుఁడగు క్రోధనునింజూడ నోడలమీఁదుగా నీయూరుచేరుటకై ద్వారవతి యరుదెంచి మూడుదివసంబులావీటిలో నివసించెను తనకూఁతురు చారుమతి నప్పుడు రాక్షసుండెత్తికొనిపోయెననియేకాని తరువాత జరిగిన వార్తలేమియు నెఱుంగఁడు.

మేమెవ్వరమో మహావీరులము దేశములు పెక్కుజయించితి మనివిని యారాజు దైవికముగా మర్యాదకై మమ్ముఁ జూడవచ్చి మాకువార్తనంపెను. మేమతని రాక కనుమోదించుచు శిబిరద్వారము దనుక నెదురుపోయి సగౌరవముగాఁ దీసికొనివచ్చి యుచితాసనాసీనుం గావించి స్వాగతపూర్వకముగా గుశలప్రశ్నము జేసితిమి. అతండు తనవృత్తాంతము మాకిట్లుచెప్పెను.

రాజపుత్రులారా! నాయదృష్ట మేమనిచెప్పికొందు. లేక లేక నాకుఁ జారుమతియను నాఁడుపిల్ల కలిగినది. దానికిఁదగినవరుఁదీసికొని రాలేక స్వయంవరముచాటింపించితిని అందుఁ గల్వాణమంటపమున కరుగుచున్న నాపట్టి నాకసమునంబోవురక్కసుడొక్కఁడట్టెవచ్చియెత్తికొని పోయెను. ఎంతయోదూరము వెదకించితిని. ఆకన్యజాడ యేమియుఁ దెలియలేదు. నాఁటిసుతనేటి దనుక నాభార్య నిద్రాహారములులేక బిడ్డకై పరితపించుచున్నది. వగపునిరర్ధకంబనియెఱిఁగి యున్నను మోహ