పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/314

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రోధనునికథ.

301

వీరు సులోచనుని తరువాతి వారేమో! కానిచో నితరుల కింత పరాక్రమముండుట యరుదే. వీరు మీతోఁ దాళధ్వజుని కుమారులమని చెప్పిన మాట బాగుగా జ్ఞాపకమున్నదియా. అట్లైన మనము ధన్యులమే. అందలి నిజానిజములు దెలిసికొనుటకై తగిన వారి ననుపుడని యుపాయము చెప్పినది.

ఆనృపతి తగుపరిజను నొకనిం బిలిచి సంగరంబెట్లు వర్తించు చున్నదో తెలిసికొనిరమ్మని యనిపెను. వాఁ డతి రయంబునంబోయి యక్కడి విశేషంబు లన్నియుఁ జూచివచ్చి యిట్లు చెప్పెను.

దేవా! మనవీరులు వాఱువములెక్కి యక్కడ కరుగునప్పటికి బ్రతివీరులును బోరనాయత్తపడి యుండిరి. మనవారి గుఱ్ఱముల ముఖ పట్టణముమీఁదనున్న చిహ్నముల విలోకించుచు వారిలో వారేదియో నిరూపణపూర్వకముగా మాటాడికొని యాయుధములవిడచి మోడ్చు చేతులతో మనవారి గుఱ్ఱముల దాపునకు వచ్చి నమస్కరించిరి.

మనవీరులు వారింజూచి యోహో! ఇదియేమి చోద్యము. మన తమ్ములిందు వచ్చియున్నా రే! అని గుభాలున గుఱ్ఱములు డిగ్గ నుఱికి వారిం గౌఁగిలించుకొని విజయా ! విక్రమా! అని పేరులు పెట్టి పల్కరించుచుండ వారును నానందబాష్పములు గ్రమ్మ గ్రమ్మఱ నాలింగన సుఖం బిచ్చిరి. కంఠంబులు డగ్గుతికపడ నొక్కింత తడ వేమియు మాటాడలేక వారూరక చూచుచుండి రందు విక్రముం డను ప్రతివీరుం డిట్లనియె.

అన్నలారా! మీ రుత్తరదిశ కరిగితిరిగదా! యిక్కడి కెట్లు వచ్చితిరి? ఈరాజు మీకుఁ జుట్ట మెట్లయ్యెను ? తొలుత గుఱ్ఱములఁ జూచి గురుతుపట్టితిమి. లేకున్నఁ బ్రమాదమే జరగును. జుఁడీ. ఆహా ! నేడంత సుదినము. అయత్నోపలబ్ధముగా మనము గలిసికొంటి మని సంతోషాతిశయముతోఁ బలికిన విని మనవీరులును