పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/312

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రోధనునికథ.

299

గారు ఈరాత్రి మనచుట్టములనడిగి పిమ్మట వారికి వార్తబంపవచ్చు నింతలోఁతొందరయేమివచ్చినది? చారుమతీ ! నీవిందులకేమందువు నీవు తెలివిగలదానవు. మొదటనే మనక్రోధనుఁ డోడిపోవునని చెప్పితివి. అనియడిగినఁ జారుమతి యిట్లనియె అమ్మా ! నాపతియు సోదరులు నుత్తర దిక్కంతయు జయించినమహావీరులు వారువీరిం గెలువఁ జాలుదురు. వారువచ్చినతరువాత నాలోచించి రేవుశత్రువులకు వార్తలంపుటయే యుచితమని పలికినది.

రాజు. ఆదినమెల్ల మంత్రులతో నాలోచించుచుండెను. విక్రముని బలముదలచి వెంటనే జయపత్రికలిచ్చి యంపుటయే శ్రేయమని పలుకుచుండెను. ఇంతలో సాయంకాలమైనది సముద్ర విహారమునకై యరిగిన వారిచుట్టములింటికివచ్చి యంతకపూర్వమే యావార్తవినియున్న వారగుటఁ క్రోధను నూరార్చుచు నిట్లనిరి.

మామా! మామాసామర్ధ్యములు నీవెఱిగిన నింతచింతింపవు నిన్నవమానము గావించిన యావీరుల గడియలోఁ బలాయితులంగావింపనిచో మాప్రజ్ఞనిందింపుము. పాపము నీకిట్టి యవమతి గలుగు యోగముండఁబట్టియే మేము లేనితఱివారినింటికి రప్పించుకొంటివి. కానిమ్ము గతమునకు వగవంబనిలేదు. రణభేరి మ్రోగింపించుము మాప్రతాపము చారుమతి చెప్పలేదా! నీవుమాకుఁ జుట్టమువై యొరులచేఁగొట్టఁబడిన నూరకుందుమా ! ఈయవమానము మాదికాదా. ఇప్పుడెవారి కందు వచ్చుచున్నామని వార్తనంపుము. అనితొందరపెట్టుటయుఁ క్రోధనుండిట్లనియె.

వీరులారా! మీసామర్ధ్యమట్టిదే కావచ్చును. ప్రతివీరుల బలముకూడఁ గొంతదెలిసికొన వలసియున్నది. నేనిట్లేనాకెవ్వరు సాటి లేరని గర్వపడువాఁడను. పోరనినఁ బండువుగాదలంచువాఁడ నిప్పుడా మాట జెప్పిన నెడద దడబడుచున్నది. నిదానింపుఁడు. ఆ వీరులు సా