పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/309

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

కాశీమజిలీకథలు - పదియవభాగము.

లలో నితండు పడిపోవును. రిపుఘాతంబులు రెండు తగిలినవి. వాని కితని తాడనంబొకటియుఁ దగులలేదు. గద త్రిప్పుటలో వానికిగల నైపుణ్య మీయనకు లేదు. తల్లీ! వేగము వారికి వర్తమానము పంపుము. ఆవీరులువచ్చిన వీరితోఁబోరాడగలరు. లేకున్న గడియలో నితండు పడిపోవఁ గలడని పలికిన రాజపత్ని యిట్లనియె.

అమ్మా! మీతండ్రిగారి పరాక్రమ మేతన్మాత్రముకాదు. ఈలాటి బలాఢ్యుల నిదివఱ కెందరను పీచమడంచి రనుకొంటిని ! అయినను వారి కీవార్త దెలియఁ జేయుమని యిదివఱకే వార్తనంపితి నని యుత్తర మిచ్చినది.

అట్లు క్రోధనుండు విక్రమునితోఁ బెద్దతడవు గదాయుద్ధము జేసి క్రమంబున బలంబు క్షీణం బగుచుండ నతని యేటులు గాచి కొన లేక తప్పుదెబ్బలు కొట్టుచు శత్రు గదాప్రహారములు మర్మ సంధుల వేధింప విహ్వలుండై యొక్కింత పెడకుఁ దప్పుకొని,

క. ఏయకు మేయకు మాగు గ
   దాయుద్ధమునందు నీవు తద్దయుఁ బ్రజ్ఞా
   గేయుఁడవైతివి మెచ్చితి
   నాయాసముదీర నిలువుమా క్షణ మనఘా!

అని పలికిన విని నవ్వుచు విక్రముండు ఏయుటమాని రాజా ! ఆయాసము తీర్చికొని రమ్ము. తొందరలేదు. పాపము! నాచేఁ జాల దెబ్బలు తినియుంటివిగదా !

క. భూధవ మాయాయోధన
   సాధన మింతియయ నీప్రసంగమువిని బల్
   యోధుఁడ వనుకొంటిని మేల్
   బోధపడె న్నీదుశౌర్యమును ధైర్యంబున్.

క్రోధనా ! ఆయాసము దీరినదియా ? నీకు గదాయుద్ధము