పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/308

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రోధనునికథ.

295

నీపోరు సంప్రాప్తించుటయు నామె అయ్యో! నాభర్త యొక్కరుండు శత్రువులు నలువురు. నలువురుతో నొక్కఁ డెట్లు పోరఁగలఁడు? అక్కటా! మాచుట్టము లీదివసమే సముద్రవిహారమున కరిగిరికదా. వారికి వార్త బంపిన లెస్సగానుండునే. శత్రువులు బలవంతులు గాకున్న నింతవ్యూహము పన్ని శుద్ధాంతము సేరుదురా! అయ్యో! మాయంత్రబల మిప్పుడేమి పనికివచ్చును? అంతఃపురముననే చిచ్చు పుట్టినది. ఔరా! శుద్ధాంతము సంగరరంగమైన నేమిచేయుదుము? అని పరితపించుచుఁ బెరటిదారిని మంత్రులకు సామంతులకు దండనాధాది వీరయోధుల కవ్వార్త దెలియపఱచినది.

మట్టమధ్యాహ్న మైనది. అర్చన సమయమని సింహద్వారము కడ మంగళనాదములు వెలయించుచుండిరి. ఆయుద్ధప్రవృత్తి యెవ్వరికిఁ దెలియదయ్యెను. మంత్రు లావార్తవిని యాశ్చర్యపడుచుఁ గొందర వీరయోధులఁ బ్రోగుజేసికొని యత్యంత వేగముగా గోటలోఁ బ్రవేశించిరి కాని, విజయాది రాజకుమారులు మువ్వురు నాయుధంబులంబూని సముద్రంబును జెల్లెలికట్టవలె నాదిట్టల లోపల నడుగు పెట్టనీయక దూరముగాఁ బాఱదోలిరి.

అంతఃపురస్త్రీలు వెరపుతోఁదలుపులు మూసికొని గవాక్షములు తెరచికొని వారి యుద్ధవిశేషములు చూచుచుండిరి. అందుఁ జారుమతి యను చిన్నది సంగరరహస్యము లెఱింగిన వీరపత్నియగుట దుర్యోధన భీములవలెఁ బోరుచున్న యాయిద్దర యుద్ధనైపుణ్యము పరికించుచుఁ గ్రోధనుని యేటులు దప్పిపోవుచుండుటయు విక్రముని యేటులు బీరువోవక ప్రతివీరునకుఁ దగులుచుండుటయుఁ గనిపెట్టినది

అప్పు డప్పుడఁతి భయపడుచు రాజపత్నితో నమ్మా! నీభర్త క్రోధనుం డనూన పరాక్రమశాలియని గరువపడు చుంటివికాని గదాయుద్ధములోఁ బ్రతివీరునికిఁ జాలకున్నాడు. ఇంక రెండు గడియ