పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/305

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

కాశీమజిలీకథలు - పదియవభాగము.

టింపుచుఁ దిరుగుటఁజేసి మీదర్శనముజేయ నవకాశము జిక్కినది కాదు. వారీనాఁడు సముద్ర విహారమునకై యరిగియున్నారు. దానం జేసి తీరికయైనది. మీవంటి మహాత్ముల పాదధూళి సోకిన మావంటి పామరుల గృహములు పవిత్రము లగుచుండును. నేఁడు మీరు మా యింటికి బిక్షావందనమునకు దయచేయవలయు, ఇదిగో భద్రగజము. తీసికొని వచ్చితిమి. దీని నధిష్ఠింపుఁడు. అనిప్రార్ధించిన విని యక్క పటయతులిట్లనిరి.

మహారాజా ! నీదానశూరత్వము ద్వీపాంతరముల విని నిన్నుఁ జూచుటకే యీయూరు జేరితిమి. నీసౌశీల్యము వినినదానికన్న నెక్కువగానున్నది. మేము సన్యాసులము. భోగములతోఁ బనిలేదు. వాహనము లెక్కము. మార్గంబెఱింగిన పరిజను నొక్కరుని మాత్ర మిందుంచుము. పాదచారులమై మీయింటికి వత్తుము. నీవింటికిం జనుము. మా కేదేని కోరికయున్న నక్కడఁ గోరికొందుమని పలికిన విని యాజనపతి సంతసించుచు వారిని వీడ్కొని యింటికిం బోయి యతులు భుజింపఁదగిన పదార్ధములు దెప్పించి రుచియుక్తముగా వండుమని భార్యకుఁ దెలియజేసి వారియాగమన మభిలషించుచుండెను..

అంతలో నాకపటయతులు లోపల జెట్టిపుట్టంబులంగట్టి పైనఁ గాషాయాంబరము లవకుంఠనముగా వైచికొని యాయుధంబులు వస్త్రచ్ఛన్నంబులు గావించి తూర్యనాదములు నింగిముట్ట రాజభటుల వెంటనూరేగుచు నడుమ నడుమఁ గనంబడు యంత్రవిశేషంబులం జూచి భటులవలనఁ దద్విధానంబులం దెలిసికొనుచుఁ బౌరులుమూగి వెంటనడువ బాహ్మణులు స్వస్తిమంత్రంబులం జదువ మెల్లన మహావైభవముతో సింహద్వారము కడ కరిగిరి.

క్రోధనుం డర్ఘ్యపాద్యాదులంగొని ద్వారముకడ కెదురువచ్చి సత్కరించి యత్యంతభక్తితో శుద్ధాంతమునకుఁ దీసికొని పోయి