పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/304

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రోధనునికథ.

291

యొక్కవిశేషము వినుండు. వారెప్పుడును భోజనముజేసినజాడయుఁ గనంబడదు. మర్యాదకై యెవ్వరైన భిక్షావందనమునకుఁ బిలిచినచోఁ బోయి పాలుమాత్రము పుచ్చుకొందురు. అని వారిగుఱించి యారాజు పురుషులు బెద్దగా నగ్గించుటయు రాజు వారిం జూడవలయుననియు భిక్షావందనము జేయవలయుననియు నభిలాషజనించుటయుఁ దన యుద్యమ మాపురుషుల కెఱింగించెను.

వారు ఓహో! యింతకన్నఁ బుణ్యకార్య మున్నదా! అవశ్యము దేవర, వారిం బూజింపవలసినదియే. మీసద్గుణములు మావలన విని వారు మిగులసంతోషించిరి. కోటలోని విశేషములు జూడవలయునని యొకప్పుడు మాతోఁ జెప్పిరి. ఇఁక నెన్నియోదినము లీయూర నుండునట్లు లేదు. కావున రేపే వారికి భిక్షావందనము చెప్పుడని ప్రోత్సాహపరచిరి.

సరే. రేపుప్రొద్దుననే నామఠమునకువచ్చి వారికి భిక్షావందనము చెప్పెదను, మఱియెక్కడికైనఁ బోయెదరేమో వారితోఁ జెప్పి యుంచుఁడని పలికి వారిం బంపివైచి తా నంతఃపురకాంతలకెల్ల నా కృత్యము దెలియఁజేసెను. రాజపత్ని సంతసించుచు నేను వారికి స్వయముగా వంటజేసి యర్పింతుఁ బెందలకడ దీసికొనిరండని భర్తను బ్రోత్సాహపరచినది.

ఆమఱునాఁ డుదయముకాకమున్న క్రోధనుఁడు స్నానముజేసి పట్టుపుట్టంబులం దాల్చి సముచితపరివారముతోఁ గాలినడకనే యా మఠంబునకుం బోయి యాబాల సన్యాసులంగాంచి తత్తేజోవిశేషంబున కచ్చెరువందుచు వారికి సాష్టాంగనమస్కారము గావించి మహాత్ములారా! మీచరిత్రము నాలుగు దివసముల క్రితమే నాచెవిం బడినది. ఈనడుమ ద్వీపాంతరమందున్న ద్వారవతీనగరమునుండి మాయింటికిఁ గొందఱు బంధువులు వచ్చియున్నారు. వారితో ముచ్చ