పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/303

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

కాశీమజిలీకథలు - పదియవభాగము.

పుడు బాలురకు ఫలములు పంచదారయు నిచ్చుచు వారిచే నారాయణస్మరణ జేయించుచుందురు. దానంజేలి వారివెంటఁ బాలకులు గుంపులుగా మూఁగి ఫలములందినుచుఁ బోవుచుందురు.

పదిదినములలో వారిప్రఖ్యాతి నగరమంతయు వ్యాపించినది. వారు వీధింబోవుచుండ నెదురుపడిన పౌరులు సాష్టాంగనమస్కారములు జేయుచుఁ గొంతదూరము వారితో నడిచి వెనుకకుఁ బోవుచుందురు. కొందఱు భిక్షావందనములకు రమ్మని కోరుచుందురు. సంతతిలేని స్త్రీలు రాత్రుల మఠమునకుఁబోయి యతిభక్తితోఁ బాలు ఫలములు నర్పించుచుఁ దమకుఁ బుత్రులుగలుగువిధానము బోధింపుఁడని వేడుకొనిన నేదియో చెప్పి వారిని సంతోషపఱచి పంపుచుదురు. “ఎవరేమియిచ్చినను బుచ్చుకొనరు. ఫలములందికొని యప్పుడే పంచిపెట్టుదురు.” అనియూరంతయు వాడుక వ్యాపించుటచే వారి సుగుణములు మఱియుం బెద్దగా నెన్నుచుండిరి.

వారికీర్తిక్రమంబున మఠంబువదలి, వీధులునిండి, గోడలుదూకి, మేడలెక్కి., సందులదూఱి, దుర్గముల నతిక్రమించి, శుద్ధాంతములఁ బ్రవేశించి, కోటదాటి, రాజుగారిచెవిం జేరినది. క్రోధనుఁడు సన్యాసులప్రఖ్యాతి విని యక్కజమందుచు మఠాథిపతుల రప్పించుకొని యిట్లనియె.

మనగ్రామము మహానుభావులైన సన్యాసులు నలువురువచ్చి మఠములో నివసించియుండిరఁట. వారెట్టివారు? ఎందుండి వచ్చిరి? వారి ప్రవర్తనము లెట్టివి? తేలుపుడని యడిగిన మఠాధివతు లిట్లనిరి.

మహారాజా! మనమఠమున కిదివఱకనేకసన్యాసులు యతీశ్వరులు వచ్చియుండిరికాని యిట్టి నిస్పృహుల నిట్టివిరక్తుల నెన్నఁడును జూచి యెఱుంగము. సమలోష్ఠకాంచనులన వీరికే చెల్లును. ఫలము కాయ యెవ్వరైన నిచ్చిన నందుకొని యందే పంచిపెట్టుదురు. మఱి