పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/302

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రోధనునికథ.

289

యతుల కొకచోఁగాపురము, ఒకనామము గలిగియుండునా? అన్ని దేశములు తిరుగుచుండుటయే యతిధర్మము. అన్ని నామములు మాకే వర్తించును. సర్వంఖల్విదం బ్రహ్మ అను శ్రుతివాక్యము వినియుండ లేదా. బ్రహ్మవ్యతిరిక్తపదార్ధ మొక్కటియును లేదు. మేమే బ్రహ్మలము. అంతయు బ్రహ్మమయంబు. మేము భిక్షాటనముజేసి భుజింతుము. మీరేమియు మాకీయనవసరములేదు. కావలసిన మేమే మీ కీయఁగలము. అని పలికిన విని వారు వారి నిస్పృహత్వమునకు వెరగందుచు వారు మహానుభావులని తలంచి మఱేమియుఁ బ్రశ్నములు వేయక భయభక్తివిశ్వాసములతో వారి వెనువెంటఁ దిరుగఁజొచ్చిరి.

వారు ప్రొద్దుటలేచి స్నానముజేసి కాషాయాంబరములు ధరించి తత్వములు పాడుచు భిక్షాటనము సేయువారుం బోలె వీధులం దిరుగుచు యంత్రవిశేషంబులం బరికింపుచుండిరి. గుప్పెడు బియ్యము తప్ప వారేమియుం బుచ్చికొనరు వారి కిష్టమైనవారియింటకడనేకాని నిలువరు. ఇట్టి మహాత్ముల నిదివఱకుఁ జూచియుండలేదని పౌరులు జెప్పుకొనుచు వారి వెనువెంటఁ దిరుగుచుందురు.

ఆనగరమంతయు యంత్రములతో నొప్పుచున్నది. ఒకవీధికిఁ బదియంత్రములున్నవి. మఱత్రిప్పినంత తలుపులు పడిపోవును. అప్పు డా వీధినుండి యవ్వలకుఁ బోవశక్యముగాదు. శత్రువులు గ్రామసీమ కైనఁ జేరజాలరు. చేరినను వీధులం బ్రవేశింపవశముకాదు. ప్రవేశించినను దలుపులుపడినంత నానడుమంబడి మడియవలసినదే. కోట కనేక దుర్గములున్నవి. ఎట్టి బలవంతులైనను నాయంత్రంబులఁ దప్పించుకొని యాకోటలోఁ జేరఁజాలరు.

రాజకుమారులు నలువురు నిత్యము వీధులఁదిరుగుచుఁ బదిదినములలో నావీటి రహస్యములన్ని యుం దెలిసికొనిరి. ఆనగరము విశ్వకర్మనిర్మితమేమోయని భ్రాంతిపడఁజొచ్చిరి. వారు వీధుల నడుచున