పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/300

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రోధనునికథ.

287

విని గ్రీష్పతి నేనన్నమాట యసత్యమంటివి. ఈ వాల్గంటుల మాట వింటివా ? వారు వీరుకోరిన గుణములుగలవారై యుండకపోరు. వీరిభర్తలు గాయత్రీ ప్రసాద సంప్రాప్తులేయని యింద్రునికడ యుక్తి యుక్తముగా నుపన్యసించెను.

అప్పటికి దేవేంద్రునిబుద్ధి కొంతమారినది స్వామీ ! మే మీ కన్యకలకుఁ బెండ్లిజేయవలయునని తలంచు చుంటిమి. ఏమందురు ? అని యడిగిన సరిసరి. అట్లుచేసిన వేదజననికి, గోపమూ రాదా! ఆమెచేఁ గూర్పఁబడిన భర్తలేయుత్తములనిచెప్పి మాకుసంతోషముగలుగ జేసెను.

అప్పుడు మాతండ్రి నన్ను దాపునకుఁజీరి మధుమతీ? మీకు గాయత్రీమహాదేవి యనుకూల వాల్లభ్యంబు గలుగఁ జేసినదియా! మీ కిష్టముగానున్నదిగద. అని యడిగిన నేను తత్సమయోచితము లైన మాటలు జెప్పి యతని మెచ్చజేసితిని. తరువాత మీ విజయవార్తలం దెలుపుచు మాకు వారితో భూలోకములో విహరించుటకు విమాన మిప్పించుమని కోరితిని. అతం డంగీకరించి యప్పుడే విమానశాలాధికారిపేర జీటివ్రాసి యిచ్చెను.

మేమాయింద్రునిచే ననిపించుకొని యప్పుడే విమానశాలకుం బోయి యాయధికారికి చీటిఁజూపి మాయిచ్చవచ్చిన విమానమేరికొని పరిజనులకుమాత్రము జెప్పి యిందువచ్చితిమి. యిందులకై యాలస్యమైనది. గాయత్రీమహాదేవి యనుగ్రహంబున మాతండ్రిగూడ ననుమతించెను. మనమీ విమానమెక్కి మూడులోకములు సంచారము సేయవచ్చును. అని యావృత్తాంతమంతయు నెఱింగించినది.

ఆవార్త విని విక్రముఁడు సంతసించుచు గాయత్రీదేవి ప్రభావ మెట్టిదో తెలిసికొంటిరా యని సోదరుల కెఱింగించి సోదరులతోఁ దరుణులతో నమ్మహాదేవికి మ్రొక్కియప్పుడే యావిమానమెక్కి మధుమతి కిట్లనియె.