పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/299

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ఇంద్రుఁడు - వా రెవ్వరు?

వారుణి - భూలోకచక్రవర్తి కుమారులు.

ఇం – (కన్ను లెఱ్ఱ జేయుచు) ఏమి! మహామునులకుఁబ్రత్యక్షముగాని గాయిత్రీదేవి మీకుఁ బ్రత్యక్షమైనదియా? భర్తల నిచ్చినదియా? ఎవ్వరో యువకులు మాయజేసి యట్లు చెప్పియుందురు. మీరు స్వతంత్రించి భూలోకమున కరుగుటతప్పు. మీనిమిత్తమై భర్తల మాటాడుచుంటిమి. మాసెలవు లేనిదే యిల్లు కదలితిరేని మిమ్ము దండింపఁజేసెదఁ జుఁడి! పో పొండు అని యదలించుటయు మాగుండెలలో ఱాయిపడినది. తెల తెలబోవుచు నేమాటయుఁ బలుకనేరక చూచుచుంటిమి.

అప్పుడు మాపుణ్యవశంబున దైవికముగా బృహస్పతి గారచ్చటికివచ్చిరి. ఆయనం గూర్చుండఁ బెట్టి మాతండ్రి గురూత్తమా! వీరి చరిత్రము వింటిరా? వీరికీ గాయత్రీదేవి ప్రత్యక్ష మైనదఁట మంచి భర్తలం దెచ్చియిచ్చినదఁట. ఆవ్రతము వీరికి మీరే యుపదేశించితిరఁట కాదా? అని యడిగిన నగ్గురుండు ఔను భూలోకములో శక్తి ద్వీపమున నున్న గాయత్రీదేవిని నాఱువత్సరము లారాధించినవారికి నద్దేవి కామితము దీర్చును. ఇది సత్యమైనమాటయే యని చెప్పిన నింద్రుఁడు నవ్వుచు ననేక సహస్ర సంవత్సరములు దలక్రిందుగాఁ దపం బొనర్చిన మహర్షులకుఁ బ్రత్యక్షముకాని గాయత్రీదేవి గొన్ని శుక్రవారములు సేవించినంతఁ బ్రత్యక్షమై కామితములం దీర్చునా. ఈ మాట విశ్వాసపాత్రముగాలేదని చెప్పుటయు గ్రీష్పతియిట్లనియె?

మహేంద్రా! అట్లనరాదు గాయత్రి ప్రత్యక్షముగాఁ గనంబడదు కాని కామితములఁ దీర్పకమానదు. బాలికలారా ! మీరు నాఁడు నన్నడిగితిరిగదా? ఆయమ్మవారి నారాధించితిరా! ఏమిజరిగిన దని యడిగి మేము యధార్ధమంతయు జెప్పితిమి. మా మాటలు