పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/297

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

కాశీమజిలీకథలు - పదియవభాగము.

పెద్దతడవు మేము సుధర్మా సభాబాహ్యప్రదేశమున నివసించితిమి. తిరుగా మాకింద్ర దర్శనమైనది కాదు. ఇంటికి వచ్చితిమి. తరువాత నీమాట జెప్పుటకై పదిసారులు పోయితిమి వారి దర్శన మైనది కాదు. మీకొఱకె యెదురు చూచుచుంటిమని చెప్పిరి.

ఆమాటలు వినినంతమాగుండెలుఝల్లుమన్నవి. అయ్యయ్యో! మీ రేల తొందరపడి యింద్రుని కెఱింగించితిరి. మా కం దమ్మవారు ప్రత్యక్షమై కామ్యములు దీర్చినది దానంజేసి యాలస్యమైనది . మహేంద్రుఁడు మేము భూలోకమునకరుగుటయె తప్పనియె నేమి? బృహస్పతిగారి యనుమతి పడసియే పోవుచుంటిమి. అయ్యో ! మనుష్య భర్తృత్వము నిందింతురుకాఁబోలు! ఏమిచేయుదము? విమానమెట్లు సంగ్రహింతుము? వారితో నీమాట చెప్పుదుమా మానుదుమా? చెప్పినఁ దప్పుపట్టి పోనీయరేమో? చెప్పకున్న నందు పోవుటయెట్లు? అని మేము డోలాయిత హృదయులమై యేమిచేయుటకుఁదోచక తొట్రుపడుచుండ నింతలో నింద్రుని పరిచారకుఁ డొకఁ డక్కడికివచ్చి మాపరిచారికలం జీరి మహేంద్రుని సెలవైనది. తక్షణమురండు. అని పలికిన విని మేము ఓహో ఈపిలువు మానిమిత్తమేయై యుండవచ్చును. ఏమిచెప్పుకొందుము అని యాలోచించి వారి కిట్లంటిమి.

వారివార్తయేమైనదని మహేంద్రుండు మిమ్మడిగిన వా రప్పుడే వచ్చిరి. కావునఁ దిరుగా మీకడకు రాలేదని చెప్పుడు పైమాట జూచుకొందమని యుపదేశించి పంపిరి. వారుదూతలవెంట మహేంద్రుని కడకరిగి నమస్కరించుటయు నతండు మీరు కన్యకా చతుష్టయము పరిచారికలు కారా? తిరుగా వారిమాట జ్ఞాపకముచేసితిరి కారేమి! వారింటికి వచ్చిరా లేదా? అనియడిగిన వాండ్రు స్వామీ! వా రామఱు నాఁడే యింటికివచ్చిరి. అమ్మవారు ప్రత్యక్షమై వరము