పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/296

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రోధనునికథ.

283

ణులు దిగివచ్చి వియోగచింతాసాగరమగ్నులై తమరాక కెదురు చూచుచున్న భర్తలం గౌఁగిలించుకొని యానందాశ్రువులచే వారి శిరంబులం దడిపిరి. అప్పుడు విక్రముఁడు మధుమతిని గ్రుచ్చియెత్తుచు మత్తకాశినీ! మీరు మమ్ము మాయజేసి పోయితిరని తలంచితిమి. అబ్బా! యిట్టి వియోగశోకము శత్రులోకమునకైన రావలదని కోరుచున్నాను. అని తాము వారిగుఱించి పడిన పరితాపమంతయుఁ జెప్పి వారింగూడ దుఃఖవివశులం గావించి మీరేమిటి కనుకొన్న గడువునకు వచ్చితిరికారు? మిమ్మక్కడ నెవ్వరైన నాటంకముసేసిరా? మీవృత్తాంతము సవిస్తరముగాఁ జెప్పుఁడని యడిగిన విని మధుమతి భర్తకు నమస్కరించి యిట్లనియె,

మనోహరా! మీరిక్కడ వియోగదుఃఖ మనుభవించుచుందురని మే మెఱుంగుదుము. అయినను రాశక్యమైనదికాదు. వినుండు. మేము మీ సెలవుపొంది తిన్నగా స్వర్గమున కరిగితిమి. మేము నలువురము నందనవనములో దూరుపుదెసనున్న పారిజాతతరుషండము నడుమ నొప్పు వసంతమను పేరుగల సౌధంబున వసింతుము. కావున ముందుగా మామేడ కే పోయితిమి.

అందు మాపరిచారికలు మమ్ముజూచి అయ్యో! మీరు భూలోకమున కరిగి యింతయాలస్యముగా వచ్చితిరేల! ఎప్పుడైన నిన్ని నాళ్ళు జాగుచేసితిరా? మాసము దాటిపోయినది. మిమ్ము భూలోకములో నెవ్వరైన నిర్భంధించినారేమో యని మొన్ననే మహేంద్రుని కడ కరిగి చెప్పితిని. మీరు ప్రతిశుక్రవారము భూలోకమున కరుగు చుండుట ఆయన యెఱుగరఁట. కన్నులెఱ్ఱజేసి మాసెలవు లేనిదే వాండ్రు భూలోకమున కేల పోవలయు? నిలువుం డిప్పుడే తగినవారిం బంచి రప్పింతునని చెప్పుచుండ బృహస్పతిగా రరుదెంచిరి. వారెద్దియో రాజకార్యముల మాటలాడుకొనుచు మామాట మఱచిపోయిరి.