పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/295

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

కాశీమజిలీకథలు - పదియవభాగము.

యిందురాకుండ నాటంకపరచిరేమో! లేకున్న వారిందు రాకుండ గడియనిలుతురా! లబ్ధనాశనమన నిట్టిదే యనిపరితపింప విజయుఁడిట్లనియె.

విక్రమా! దేవకాంతల ప్రేమ యవ్యాజమైనది. వాండ్రఁ గట్టిపెట్టినను నెట్లో తప్పించుకొని వత్తురుగాని యందు నిలువరు. వారు రాకపోయినచో మనయాయువు లీదీవియందు ముగియవలసినవే యని పలికెను. చిత్రభానుండు నలుండుగూడ నట్లే యనువదించిరి. మఱి రెండుదినములు గడిచినను వారిజాడ గనంబడలేదు. మిక్కిలి పరితపించుచు వారు సముద్రతీరంబునకుంబోయి యందుఁ గూర్చుండి వారురారని నిశ్చయించి తత్క్రీడా వినోదముల నొండొరులకుం జెప్పికొని పరితపించుచు నాశదీరక యాకాశమునందే సర్వదా దృష్టులు వ్యాపింపఁజేయుచుండిరి. వారిజాడ గనంబడలేదు.

వెండియు దేవీభవనంబున కరుదెంచి ముఖపంటపములో సాష్టాంగముగాఁ బండుకొని యమ్మహాదేవిని ధ్యానించుచు,

గీ॥ ఉదధి జలమధ్యమున మున్గుచున్న మమ్ముఁ
     దెచ్చి యమరాంగనల గూర్చితివిగదమ్మ
     బేలతనమున మేమాండ్ర గోలుపోతి
     మంబ! యెటుచేర్తొ కృప మా కుటుంబినులను

అని ప్రార్ధించుచు నా రాకుమారు లారాత్రియెల్ల జాగరము జేసి దేవి నారాధించుచుండిరి. తెల్లవారుసమయమున నంతరిక్షమున గంటలచప్పుడు వినఁబడినంత వారత్యంత సంతోషముతో బయటకు వచ్చి తలలెత్తిచూచిరి. అప్పుడు కనకమణిరుచిరప్రభాపటలంబు క్రిందికి వచ్చుచున్నట్లు కనంబడుటయు నది విమానమని వారు దెలిసి కొని చప్పటులు గొట్టుచు నాట్యముసేయఁ దొడంగిరి.

అంతలో నావిమానమువచ్చి దేవీముఖమంటప ప్రాంగణమున వ్రాలినది. అందుండి మఱపుతీగవలె మెఱయుచు నానలువురు తరు