పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/294

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రోధనునికథ.

281

గూడ విమానము లున్నవని వినియున్నారము, ఉండుగాక. ఇందులకై మీరొక సహాయము చేయవలసియున్నది. దేవలోకమునుండి యొక విమానము సంగ్రహించి తీసికొనిరావలయును. అప్పని మీకుసాధ్యమే! యని యడిగిన మధుమతి యిట్లనియె.

మనోహరా! స్వర్గమునందలి విమానశాలలో వేనవేలు విమానము లొప్పుచుండును. ఆకాశగమనము సహజమైనది. కావున మాకు విమానములతోఁబనిలేదు. దేవలోకములో భార్యాభర్తల మిధునమునకు గాని విమానమీయరు. విమానశాలాధికారి సెలవు లేనిదే విమానము సంగ్రహించుట కష్టమే. మావివాహవృత్తాంతములు పెద్దలతోఁ జెప్పుదుమా మానుదుమా యని మేమింకను నా లోచించుచుంటిమి. మనుష్యభర్తృత్వమునకు వారు శంకింతురేమో యని యనుమానముగా నున్నది. కానిండు. ఈసంఘటనము గాయత్రీకర్తృకమగుటచే మమ్ము మావారు నిందింపఁగూడదు. ఎట్లైనను మీకువిమానమొకటితీసికొనియియ్యగలము. మమ్మనుపుఁడనికోరినది.

అరాత్రి నలువురు నొకచోటఁజేరినతరువాత విక్రముఁడు సోదరులతోఁదనయుద్యమ మెఱింగించి విమానము దెచ్చుటకై భార్యల నాకమున కనుపుటకు యోచించి వారింగూడ నంగీకరింపఁ జేసెను.

దేవకన్యలు నలువురు భర్తల యనుజ్ఞ బుచ్చుకొని నాఁటి వేకువజామున స్వర్గంబున కరిగిరి. ఆకాంతలరాక నిరీక్షించుచు రాజపుత్రులు , గాయత్రీదేవి యాలయంబున వసించి క్రోధనుని జయించు నుపాయ మాలోచించుచుండిరి. దేవకాంతలు వత్తు మన్న గడువునకు రాకపోవుటచే వారికిఁ బెద్దవిచారము గలిగినది. అప్పుడు విక్రముఁ డయ్యో! నేను చాల తెలివితక్కువపని చేసితిని. మనుష్యభర్తృత్వమునకు వేల్పులు గర్హింతురని మధుమతి చెప్పిన మాటలోఁ గొంత సత్యమున్నది. ఈవార్తవిని వీరిని మందలించి