పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/29

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

కాశీమజిలీకథలు - పదియవభాగము.

బునఁ బార్వతీపరమేశ్వరులపై దాను రచించిన గీతఁబొకండుపాడుట కుత్సహించుచున్నాఁడు. అనుజ్ఞయిత్తురే”యని యడిగినఁ దుంబురుఁడు లేచి "నేఁడుకాలాతీతమైనది. ఱేపుజరుగఁబోవు సంగీతసభలోనీగీతవిషయములు పాడవచ్చు”ననియుత్తరమిచ్చెను. 'ఇదిసంగీతవిషయముకాదు. శివస్తోత్రగీతమునేఁడే పాడవచ్చు'నని సభాధిపతిగానున్న బృహస్పతి యాజ్ఞయిచ్చెను.

అప్పుడుపబర్హణుండు వీణపై మనోహర స్వరములు వెలయించుచు నిట్లుపాడెను.

పంచచారమరము. ఉమామహేశ పాదపద్మయుగ్మమున్ భజింతునే
        సమస్త దేన మస్తకప్రశస్త రత్న భూషణా
        ప్రమేయ చిత్ర సత్ప్రభా విభాసితంబులన్ సదా
        నమో నమో నమో యటంచ నంతభ క్తి యుక్తిమై.

ఆగీతము వీణతంత్రీస్వర మిశ్రితముగా నపూర్వస్వరకల్పనలు సేసి తనకుఁగల సంగీతవిద్యావైదగ్థ్య మంతయుఁ బ్రకటించుటయు సభ్యులాశ్చర్యరసావిష్ణులై యాహాహాయనిపొగడ మొదలిడిరి. ఈ మహా పురుషుండెవ్వఁడని యందఱు నతనిదెస దృష్టులువ్యాపింపఁజేసిరి. క్షణకాల మాసభాభవనము తదీయ స్తవనాదముఖరితమై యొప్పినది. చిత్రరధుని పుత్రికలు అతనిసంగీతనైపుణ్యము ఆకారసౌష్ఠవము తేజోలక్షణముపరికించి మోహావివశులై యూరక యతనిఁ జూడఁదొడఁగిరి. తరువాత నప్పురాణదంపతులకు నివాళులిచ్చిరి. మహోత్సాహముతో నాఁటిసభ ముగిసినది.

అని యెఱింగించి యయ్యోగి పుంగవుండు. తదనంతరోదంతం బవ్వలిమజిలీయం దిట్లు చెప్పందొడంగెను.


__________