పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/289

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

కాశీమజిలీకథలు - పదియవభాగము.

రాజకుమారులను వారిసమ్మర్దము వినఁబడగనే గుడిలోఁ బ్రవేశించి యమ్మవారివెనుక దాగియుండిరి.

అనిమిషకాంతలు వాడుక ప్రకారము జలకమాడి బ్రదక్షిణ పూర్వకముగా గుడిముఖ మంటపములోని కరుదెంచి యందుఁ వారుంచిన వస్త్రాలంకారాదులం గానక యమ్మవారప్పుడే తమభర్తలకుఁ దాల్ప నిచ్చినదని నిశ్చయించి గుడిలోఁ బ్రవేశించి సమంచిత స్వరంబుల నమ్మహాదేవింగీర్తింపుచు సపర్యానంతరమున ముఖమంటపములోఁ గూర్చుండి యిట్లు సంభాషించుకొనిరి.

గంధవతి - మధుమతీ ! యిద్దేవి మన మందుఁ బోవునప్పటికే భర్తలందెచ్చి యుంచునని చెప్పితివికావా ? ఏరీ?

మధుమతి — ఓహో ! నీకు భర్తంజూడ జాల తొందరగా నున్నది గదా? మన ముంచిన వస్తువు లిందు లేకుండుటచే నవి యామె సంగ్రహించినదని యొప్పుకొనియెదవా ?

గంధవతి -- ఆమెయే తీసినదనుమాటయేల? మఱియెవ్వరైన వచ్చి తీయఁగూడదా.

మధు - మనముగాక యిచ్చటి కిదివఱ కెవ్వరైన వచ్చియుండిరా? రెండు గడియలు తాళుము. నీకంతయుం దెలియఁగలదు. నీవల్లభున కే రంగు పుట్టంబులుంచితివి?

గంధవతి - ఇంద్రనీల చ్ఛాయాపుటంబులు. నీవో?

మధు -- నాకుఁదెలుపేయిష్టము తెల్ల చీనాంబరములుంచితిని

గంధవతి - వారుణియో

వారుణి - నాకెఱుపు నేనట్టివేయుంచితిని

గంధవతి — చంద్రకళకేవర్ణ మిష్టము ?

చంద్రకళ - ఆకుపచ్చనిరంగునాకుఁజాలప్రీతి నేనాపుట్టంబులుంచితిని. అని వారు మాట్లాడుకొనుచు నమ్మవారు తమకు భర్తలం