పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/284

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సావిత్రికథ.

271

వానిలక్ష్యముసేయక తనలక్ష్యమునందే దృష్టినుంచి కొంత దూరమేగునప్పటికి సూర్యోదయమైనది. ఆవెఁలుగులోనతండు తన దృష్టుల సముద్ర తీరమువెంబడి కొంతదూరము వ్యాపింపఁజేసెను. నూఱు గజముల దూరములోఁ బెద్ద దారువేదియో యొడ్డునఁ జేరి యున్నట్లు కనంబడినది. అతం డుబ్బుచుఁ గనుఱెప్పపాటులో నా దారువుచేరువకుఁ బోగలిగెను.

చంద్రోదయ చంద్రాస్తమయసమయములయందు సముద్రము పొంగి తరువాత తీసిపోవుచుండుఁ గదా. నాఁటిరేయి పోటున కా దారువు గట్టెక్కి పాటుతోఁబోవక యందాగియున్నది. దానిం బరిశీలించి చూడ సముద్రపుటోడ తెరచాపకొయ్యవలె దోచినది. గోడ నంటిన బల్లులవలె మువ్వురుపురుషు లందు బోర్లగిలఁబడి యంటిపండుకొనియున్నారు.

వారిం గురుతుపట్టి యతండు గుండె ఝల్లుమన హా! సోదరులారా! యని యఱచుచుఁ బ్రతివచనంబు గానక వారు మృతిబొందిరని నిశ్చయించుకొని నేలఁ గూలఁబడి పెద్దయెలుంగున నేడువందొడంగెను. అంతలో నతండయ్యో ! నాకిదేటిశోకము. ఆహారము గుడవనిచోఁ బదిదినముల వఱకుఁ బ్రాణములుబొందిని విడిచిపోవవనివైద్యలు చెప్పుదురు. మేము సముద్రములోఁబడి యైదుదివసములైనది. ఇతరోపద్రవము లేనిచో వీరికి మేనిలో బ్రాణములుండవచ్చును పొరబడి యాఁడుదానివలె నేడుచుచుంటినేమి? అని తలంచి యప్పుడ వారి యొద్దకుఁబోయి యొడలు ముట్టికొని యూపిరియుండుట గ్రహించి వడి వడి యొక చలమద్రవ్వి యందలి నీటిచే వారి దేహములుప్పుకస వోవఁ గడిగి మోములపై నీళ్లుజల్లి జిడ్డువోవ దుడిచితుడిచి యన్నా! విజయా! తమ్ముఁడా'! అనిపిలుచుచుండ వారికించుక యూపిరియాడుచున్నట్లు పొడకట్టినది. అప్పుడతండొక పర్ణపుటంబున నీరువట్టి వారి నోరు