పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/281

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

కాశీమజిలీకథలు - పదియవభాగము.

కాపాడుమని బ్రతిమాలికొనిన నిరసించితి విది బుద్ధిమంతుల తెరవే ? నన్ను హేలగా మోయుచుంటినని గర్వోక్తు లాడితివేదీ. నాయెడమ చేతి యీచిటికెనవ్రేలి బరువు మోయము. నీప్రజ్ఞ జూతునుగాక ! అని పలుకుచు నావ్రేలాతని పక్షముమీఁద మెల్లనమోపెను.

అప్పుడతండు పిచ్చుకపై పెద్దపాషాణము పెట్టినట్లు క్రుంగఁబడి యీకలు రాల నోఱుదెరచుకొని రక్తముగారుచుండ నెలుగురాక కీచు కీచుమని యఱచుచు మహాత్మా! అపరాధము సేసితి. రక్షింపుము అని తలతో సూచనగావించెను.

ఉపేంద్రుడు నవ్వుచు సుపర్ణా ! యింతే నీబలము ! నన్ను సకుటుంబముగా మోయువాఁడవు కాదా? ఈవ్రేలి బరువే మోయలేక పోయితివేమి? ఆ గర్వోక్తులేమైనవి! యిప్పుడైన నుపేంద్రుని మాట విందువా అని చేయెత్తి యెత్తిపొడుచుటయు గరుడుండు గరువము విడిచి చెంపలు వాయించుకొని యుపేంద్రుని కపరాధముజెప్పి కొనుచు సుముఖుని విడిచి యెందేనిం బోయెను.

పిమ్మట సుముఖుఁడు మాతలిఁ కూఁతుం బెండ్లియాడి నందన వనంబునఁ గ్రీడాశైలంబుల మందాకినీ కాంచన సిక తాతలంబుల విహరించుచుఁ బెద్దకాలము సుఖించెను. ఈకథగల పుస్తకము మా యింటనుండమిఁ జదివితిని. దీనింబట్టిచూడ నాగ కుమారులలోఁ గూడ ద్రిలోకాతీత సౌందర్యముగల వారుందురని తెలియఁబడుచుండుటలేదా. అందులకైనాగులాయని యడిగితిని. తెలిసినదియా యని యింద్రుని కూఁతురుమధుమతి చెప్పినవిని తక్కినవారనుమోదించుచు నమ్మవారికెవ్వరుత్తములనితోచునో వారినిదయఁజేయగలదు. ఇంతియే మనము కోరవలసినదని పలికిరి.

అంతలోఁ దెల్లవారు సమయమగుటయు వారు రాఁబోవు శుక్రవారమునాఁటి కవ్వేదమాత తమకు భర్తలందెచ్చియిచ్చునను