పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/280

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుముఖునికథ.

267

మహేంద్రుండు నవ్వుచు నిట్లనియె.

వయస్యా ! మనమందఱము కశ్యప సంతతిలోని వారమే యగుట నొండొరులము మైత్రిగలిగి యుండవలయు నీ మాతలి కూఁతురు మిక్కిలి చక్కనిది దాని కెక్కడ సరిపడిన వరుఁడు లభింప లేదని తిరిగి తిరిగి సుముఖునేరికొని వచ్చెను. సుముఖున కిప్పుడే పెండ్లియైనది. అట్టివానిం భక్షింప నీ కెట్లు నోరువచ్చును ? మా చుట్టఱికము దలంచి వానిని విడువుము. నీకంతకన్న బలముగలుగఁ జేయు వివాహభోజనము పెట్టించెద నీభోజనము విడువుమని సానునయముగాఁ బలికినవిని రోషారుణిత నేత్రుండై పతత్రి పుంగవుం డిట్లనియె.

మహేంద్రా? వీని భక్షించి తీరెదనని నాగ సభా మధ్యంబున శపధముజేసి వచ్చితిని. ఇప్పుడు వీని నేను విడిచితినేని నాగు లిఁక నామాట బాటింపరు. నీ మాట వినమి కీమాటు సైరింపుము సుముఖునిందు రప్పింపుమని పలికిన విని యనిమిషపతి పతగపతి కిట్లనియె సుపర్ణా ! ఇది కేవలము నామాటయే కాదు. ఇందున్న దేవతలు మహర్షులు దిక్పతులు నీకీ మాటయే బోధించుచున్నారు. అందరిమాట యటుండనిమ్ము ఈయుపేంద్రుని యభిప్రాయముగూడ నట్లే యున్నది. అమ్మహాత్ముని యానతి దాట నీకు సామర్థ్యము గలదా యని యడిగిన నతం డిట్లనియె.

మహేంద్రా! నేనుగాక యుపేంద్రుని మోయువాఁ డెవ్వఁడు గలండు? అతనికి ధ్వజముపై నిలచి జయము గలుగఁజేయుదును. ఇట్టి యాప్తుని నోటి యాహార మతఁడేల చెడగొట్టగలఁడని సాటోపముగాఁ బలికిన విని యుపేంద్రుండు మందహాసము గావించుచు గరుడున కిట్లనియె.

పక్షిపతీ! పాపము సంగరములయందు నీ కతంబున నాకు జయము గలుగుచున్నదిగా! కానిమ్ము. సంతోషమే. మహేంద్రుఁ డన మూఁడు లోకముల కధికారి. అతండు సుముఖుని విషయమై