పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదమహర్షి కథ.

15

రంబునకుఁ దోడ్కొనివచ్చి రత్న మంటపమునందలి మాణిక్యపీఠంబునం గూర్చుండఁబెట్టె నట్టియెడ,

శా. మ్రోసెన్ దంధణయంచు దుందుభిరవంబుల్ నల్దెనల్‌నిండఁబూ
    సేనల్ జల్లిరి వేల్పులాడిరి సురస్త్రీ లింవుగా వేణువీణా
    సంగీతముల న్నుతించిరట గంధర్వుల్ మును ల్భక్తితో
    దోసిళ్లొగ్గి నమశ్శివాయ యనుచున్ స్తోత్రంబులం జేయఁగా.

చిత్రరథుం డట్టితఱిఁ దనమనోరథంబు దీర నానాభువనంబుల నుండి యరుదెంచిన శునాసీరాది బృందారక బృందంబులు సంభ్రమముతో నుపలక్షించుచుండ భార్యతోఁగూడ నభిముఖముగాఁ గూర్చుండి యుమామహేశ్వర చరణారవిందంబుల సువర్ణపుష్పంబులఁ బూజింపుచుండె నప్పుడు తత్పుత్త్రికలు మాలావతీప్రభృతులేబదుగురు జగన్మోహన రూపవేషంబులతో వచ్చి తలిదండ్రులు గావించునర్చనలకు తోడుపడుచుండిరందు,

గీ. మాలావతి యటఁ జమరీ
    వాలముకై బూని వీచెఁ బరమేశ్వరులన్
    లోల మణికిరణ కంకణ
    జాల ఝణంఝణరవం బెసంగఁ బ్రియముతోన్.

కొందఱు పూజాపాత్రంబులఁ గైకొనిరి. కొందరు జేగంటల మ్రోగించుచుండిరి. కొందరు మంగళహారతులు బాడుచుండిరి. కొందరు పన్నీరు జల్లుచుండిరి. చిత్రరధుం డత్యంతవైభవంబుతో నుమామహేశ్వరుల మహాపూజగావించి స్తుతిపాఠంబులం బఠించె. తదనంతరంబున నతనిపుత్రికలే బదుగురు గీతంబులం బాడుచు మంగళహారతు లీయఁబోవుసమయంబున శారదుండు లేచి మహాపీఠంబున కనతిదూరములోఁ గూర్చున్న యుపబర్హణుని నిరూపించుచు “సభ్యులారా! యీతఁడు రత్న కేతునికుమారుఁడు. ఈమహాపూజాసమయం