పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/278

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుముఖునికథ.

265

కుఁడు మనుమని దీసికొనిపోవుచుండ నాటంకపెట్టవలదా? మాతలి యన నాముందర నెంతవాఁడు! మీయుపేక్షకూడ కొంతయున్నదని పలికిన విని గడగడలాడుచు తక్షకుఁ డిట్లనియె. స్వామీ! మేమా మాతలితో మీమాటలు సెప్పితిమి. కాని యతండు వినిపించుకొనఁడయ్యెను. బలవంతమున నాపుదమన్నను మాతలిబలమెట్టిదోమాకుఁ దెలియదు. అదియునుంగాక నారదమహర్షి యతని వెంటనుండుటచే శాపమునకు వెఱచి సాహసించితిమికాము. మీరు వచ్చునప్పటి కీవిషయమే కాదా తగవులాడుచుంటిమి. దేవా! దేవరవిషయమై మేమెప్పుడును భక్తిగలిగియుందుమని నివేదించికొనియెను. గరుడుండు క్రోధవివశుండై మాతలి నన్నేమియు లెక్క సేయలేదుగా. కానిండు. ఇప్పుడే పోయి నేనాసుముఖుని పొట్టచీల్చి కండలు భక్షించెదంగాక. ఈపాటికి పెండ్లిచేసియేయుందురు. అందు నాముందర నిలుచువారెవ్వరో చూచెదంగాక పో. పొండు. నేఁటికీమీరందఱు బ్రతికిపోయితిరని వలుకుచు నయ్యండజపతి యాక్షణమ యెగసి పక్షవాతంబువృక్ష లతాగుల్మాదుల కుత్పాతంబుగతి వ్యాపింప నతివేగంబున స్వర్గలోకమున కరిగెను. అందు సుధర్మాప్రాంగణంబును గొప్పపందిరివైచిరి. ముత్యాలు తోరణముగా గుచ్చిరి. కాంచనరత్న ప్రాంచితంబులగు నలంకారంబు లిన్నిగలవని వక్కాణింప శక్యముకాదు. పెండ్లిపందిరి శోభ వర్ణింపఁ బదిదినములుపట్టును. ఒకమూల నచ్చర లాడుచుండిరి. యొకమూల గంధర్వులు పాడుచుండిరి. మహేంద్రుండు మాతలినిమిత్తమై యుపేంద్రునిం దీసికొనివచ్చి వివాహవేదిక ప్రాంతమునఁ గూర్చుండబెట్టెను. ముప్పదిమూడుకోటులు వేల్పులు నారదాదిమహర్షులు గరుడగంధర్వకిన్నర సిద్ధవిద్యాధరాది దేవతావిశేషులు పెండ్లిపందిరి నిండఁ గూర్చుండిరి. దుందుభులు మ్రోగుచుండెను, మాతలిభార్యతోఁగూడ బీటపైఁ గూర్చుండి బృహస్పతి పురోహితుండై