పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/277

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

కాశీమజిలీకథలు - పదియవభాగము.

తారేదియో చెప్పఁబూనిరి.

ఈరీతినల్లరిగా నెవ్వరి నేమాటయుం జెప్పనీయక నాగులాటంకములు సెప్పుచుండ నయ్యండజపతి హుంకారము గావించుటయు నందఱు భయపడి నిశ్శబ్దముగా నిలువంబడిరి. అప్పుడు గరుడుండు కన్ను లెఱ్ఱజేయుచు నాగులు పొగరెక్కి నాచక్కినే యల్లరిసేయుచున్నా రే. ఒక్కఁడే మాట్లాడవలయు, వాని వాక్యము ముగియు దనుక రెండవవాఁడు మాటాడఁగూడదు. జాగ్రత. కర్కోటకా ! నీ యుపన్యాసమేమియో ముగింపుము. అనుటయు నతం డిట్లనియె.

స్వామీ! నాఁడు దేవర చికురుఁడను నాగుని భక్షింపుచు ముందరినెలలో తనకుమారుని సుముఖు డను వాని భక్షింతు నాఁటికి వాని వధ్యశిలపైఁ జేర్చియుంచుఁడని సెలవిచ్చియుండిరిగదా. మొన్న నాకమునుండి యింద్రసారధి మాతలియఁట తసకూఁతున కెందును భర్తదొరకలేదఁట యీగ్రామమువచ్చి వానితాత యార్యకు నడిగి మేమందరము వీఁడాగరుత్మంతునికి భక్ష్యము కొంపోవఁగూడదని చెప్పుచుండ వినిపించుకొనక మాతలి వానిచుట్టములతోఁగూడ స్వర్గమునకుఁ దీసికొనిపోయెదనని చెప్పినంతఁ గల్పాంతజీమూతమువలె గర్జిల్లుచుఁ బక్షిపతి యక్షీణకోపంబున నిట్లనియె.

నాకాహారవస్తువని మీరందఱు చెప్పుచుండ వినిపించుకొనక మాతలి సుముఖు నల్లునిగాఁ జేసికొనుటకై నాకమునకుఁ దీసికొని పోయెనేమి? ఇంద్రుని తేఱి గుఱ్ఱములగాచెడువాని కింతపొగ రేల గలుగవలయును. వాఁడు పిలిచినంతనే యార్యకుఁడు మనుమనిం దీసికొని నాకమున కరిగెనా? కానిమ్ము. నాకమన నెక్కడనున్నది? గడియలోఁబోయి పట్టకపోవుదునా? దేవేంద్రునెదుట మాతలిచేసిన దౌర్జన్యముగ్గడించుచు నాసుముఖుఁని జుట్టములతోఁగూడ బక్షింపక పోయినచో నన్నుఁ బక్షిపతియని పిలువవలదు. నాగులారా! ఆర్య