పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/276

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుముఖునికథ.

263

తక్షకుఁడు — కర్కోటకా ! తొందరపడకుము ఇట్టి నిబంధనముల మనమే యేర్పరచి మనమే దాటవచ్చునా? అందరు నిట్లే యనిన నేమిచేయఁదగినది? గరుడుం డడిగెను. కాని యార్యకునింటి వంతు జరిగిపోయినది. దైవ రక్షితుండై సుముఖుండు దివికరిగెను. నీకు వంతు తప్పదు. పెద్దలందఱు నట్లు చెప్పుచున్నారు. విందువా? వినవా?

కర్కోటకుఁడు— నేనెవ్వరు చెప్పినను వినను. నాకీనెలలో వంతు లేదుగదా యని మా వాని నూరికిఁ బంపితిని. వాఁడు రేపటికి రాఁజాలఁడు. అమాట గరుత్మంతునితో నే చెప్పుకొనియెదం గాక .

ధనంజయుఁడు - కర్కోటకుఁ డిందరుచెప్పుచుండవినకపోయెంగదా. కానిండు ఇఁకమీఁదటివంతుల కెవ్వరు సమ్మతింతురో చూచెదంగాక.

తక్షకుఁడు -- పోనిండు రేపతండు వచ్చుచున్నాడుగదా మన తగవులన్నియు నొక్కసారి యాపక్షి పతియే తీర్చునని భుజంగులెల్ల హల్ల కల్లోలముగా నాదివసంబెల్ల బోట్లాడుచుండిరి. అంతలో గరుత్మంతుని ఱెక్కల చప్పుడులు వినంబడినవి. పడగలు ముడిచికొని యందఱు కిక్కురుమనక నతని రాక కెదురు చూచుచుండిరి. అప్పు డప్పక్షిపతివచ్చి వథ్యశిల ప్రక్కవాలి ఱెక్కలు ముడిచికొనియెను. వథ్యశిలపై నెవ్వరింగానక కన్నుల నిప్పు లుఱుల నురగులనెల్లంగలయ నీక్షించుటయుఁ దక్షకుం డేదియో చెప్పింబోయినఁ గర్కోటకుఁ డడ్డంబై మహాత్మా రక్షింపుము. నాగులెల్లఁ గట్టుకట్టి మీతో నా మీఁద నేరములు సెప్పుట కుద్యుక్తులై యున్నారు. వీరిమాట లేమియు వినఁగూడదు. నాఁడు మీరు ముందరి నెలలో సుముఖుం భక్షింతునని చెప్పిపోయితిరిగదా అని చెప్పువఱకు నిలిచి యంతలో మఱికొందఱు నాగులతని నీవలకులాగి మహాప్రభూ ఈతనిమాటలు వినరాదు. సంఘసంస్కరణ విధ్వంసుకుఁడై కులస్థులతోఁ గలహించుచున్నాఁడని చెప్పుచుండ మఱికొందరువచ్చి వారిమాట విననీయక