పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/274

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుముఖునికథ.

261

కాళీయుఁడు - ధనంజయా! మనము గరుత్మంతుని బ్రార్ధించి యెట్లో యతనినొప్పించి యొకరీతి సంఘమరణముల దప్పించుకొంటిమి గదా. అతండు రేవు వచ్చునఁట తాను గోరిన సుముఖుందెచ్చి నడి వీధి వధ్యశిలదాపున నుంచుమని యిప్పుడే వార్త పంపియున్నాఁడు వింటివా?

ధనంజయుఁడు - విన్నాము. బాహాటముగాఁ జాటించినఁ దెలియకుండునా యేమి?

కాళీయుఁడు - అనుముఃఖుఁ డేడీ? నీకుఁ జుట్టముగదా! నీవు గూడ నతినితోఁ బెండ్లికి వెళ్లితివికావేమి?

ధనంజయుఁడు — నీయెత్తిపొడుపుమాటల కేమిలే. పెండ్లి కరిగెనో పేరంటమునకరిగెనో నే నెఱుంగుదునాయేమి?

నహుషుఁడు -- అవును. ఇప్పుడు మనకు గట్టిచిక్కే రాఁగలదు. గరుఁడుఁడు వచ్చునప్పటికి మన మతని వధ్యశిలపైఁ దెచ్చి పెట్టనిచో మన పనిపట్టకమానఁడు.

నందకుఁడు - ఆర్యకుఁ డేమిన్యాయస్థుఁడు! మనతో నేమియు నాలోచింపక మాతలివచ్చి కూఁతునిత్తు నన్నంతనే నాగాంతకున కాహారముగా నిరూపింపఁబడిన తన మనుమని వెంటఁబెట్టికొని స్వర్గమున కెట్లుపోయెను? ఇది తప్పుపనికాదా.

శంకుఁడు — మీరిప్పుడిన్ని నీతివాక్యములాడుచున్నారు. వారు నాకంబున కరుగుదురని విన్నప్పుడు వారింటికిఁజని పోవలదని యాటంకము సేయలేకపోయితిరా? ఇప్పు డేమనుకొనిన లాభమున్నది.

దీలీవుఁడు - మేము కొందర మట్టియూహజేసితిమిగాని నారదమహామునింజూచి వెఱచితిమి. అతం డలిగిన నేరాయిగానో శపింపఁగలఁడు,

కర్కోటకుఁడు -- కానిండు. గతమునకు వగచినం బ్రయోజనములేదు. నారదుమొగముజూచియే వారరుగుచుండ నెవ్వరు