పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/271

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

కాశీమజిలీకథలు - పదియవభాగము.

సుమఖు — (కన్నులనీరు గ్రమ్మ) దండ్రిలేఁడు తాతయేనన్నుఁ బోషించుచున్నాఁడు.

నారదు — ఆనక మేము మీయింటికివత్తుమని మీ తాతతో జెప్పెదవా?

సుము -- చెప్పెదస్వామీ ! తప్పకదయజేసి మమ్ముఁగృతార్ధులంగావింపుఁడు అనికోరి యా బాలుండప్పుడే యింటికిఁ బోయెను.

నారద మహర్షియుఁ బాటచాలించి నాగ పతులకెల్లఁ జెప్పి యప్పుడే మాతలితోఁగూడ నార్యకు నింటికింబోయెను. ఆర్యకుఁడు మనుమని వలన నతని రాక దెలిసికొని యున్నవాఁడగుట గృహమంతయు నలంకరించి ద్వారముకడ వేచియుండి వారు చేరినతోడనేయర్ఘ్య పాద్యము లిచ్చి స్తుతియించుచుఁ దోడ్కొనిపోయి రత్నపీఠంబులం గూర్చుండఁబెట్టి ప్రక్కలనిలఁబడి వింజామరల వీచుచుండెను.

అప్పుడు నారద మునీంద్రుండతని భయభక్తి విశ్వాసముల నభినందించుచు నార్యకా ! ఈతని పేరు నీవు వినియే యుందువు. మాతలియనువాఁడు. ఇతండు మహేంద్రునకు సారధియు మిత్రుఁడు మంత్రియునై ప్రాణములలోఁ బ్రాణమై మెలంగుచుండును. ఇట్టి తేజస్వి యెందునులేడు. యుద్ధయాత్రలయందు గుఱ్ఱములచేఁ గట్టఁబడిన యింద్ర రథ మితఁడు మనసుచేతనే నడుపుచుండును. ఇతండు గుఱ్ఱములచేతఁ జయించిన శత్రువుల వృత్రారి చేతులతో జయించు చుండును స్వర్గవైభవమంతయు నీతనిదేయని చెప్పవచ్చును. ఇతనికి గుణకేశినియను కూఁతురుగలదు. ఆకన్య చన్కఁదన మిట్టిదని మేము చెప్పకయే మా ప్రయత్నమువలన మీకుఁ దెల్లముకాఁగలదు. ఆకన్యకకుందగిన వరు నిమిత్త మీతండు స్వర్గమర్త్య పాతాళలోకములు దిరిగి యెందునుంగానక మీభోగవతీ నగరంబున కరుదెంచెను. ఇందులకే నేనుగూడ నిందువచ్చితిని. పూర్వపుణ్యవిశేషంబున నీ