పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/265

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

కాశీమజిలీకథలు - పదియవభాగము.

కడకరిగి దేవా! నారదమహఋషి దేవసారధి మాతలియటఁ యతని వెంటబెట్టుకొని వచ్చిరి. హజారముకడ నిలిచియున్నారు. మీకుఁ జెప్పమన్నారని విన్నవించినంత లేచి నారదులవారి కాటంకమేలా? లోనికిఁ దీసికొనిరాలేక పోయితీరా ? అని పలుకుచు ద్వారముకడ కరిగి మునిసమ్మతమగు నాతిథ్యము నారదునకును మహేంద్రసమ్మతమగు పూజ మాతలికిం గావించి తోడ్కొనిపోయి సభాభవనంబున రత్న పీఠంబులం గూర్చుండబెట్టి పెద్దగాస్తుతియించుచునాగమన కారణం బడుగుటయు నారదమహర్షి యిట్లనియె.

పాశహస్తా ! ఈమాతలిని నీవుయెఱింగియేయుందువు. ఈతని కూఁతురు గుణకేశినియను కన్యకకు వరుఁడు కావలసియున్నాఁడు. స్వర్గమర్త్యలోకములందు వెదకితిమి. తగినవాఁడు గనంబడలేదు. అందు నిమిత్తముపాతాళలోకమునకుఁ దీసికొనివచ్చితిని. ఈలోకంబుననున్న వారి నందఱంజూచుట కాజ్ఞయిప్పింపుమని యడిగినవరుణుఁ డిట్లనియె.

సురమునీంద్రా ! నీవు త్రిలోకసంచారివి. మూడులోకములలో నీవెఱుంగని ప్రదేశములు నెఱుంగని వారును లేరుగదా. అతండు త్రిలోకాధిపతియగు నింద్రుని సచివుండు. మీయిరువురు మాకుఁ బూజనీయులు. ఇట్టి మీ కాటంకములు సెప్పువారెవ్వరు? మీయిచ్చ వచ్చినట్లు శుద్ధాంతగృహారామ క్షేత్రంబుల విహరింపుఁడు. ఈమాతలి మానగర మెప్పుడును వచ్చియుండలేదు. ఈలోకవిశేషములన్నియు నతనికిం జూపుఁడు అని యుపన్యసించెను.

నారదమహర్షి మాతలిని వెంటబెట్టుకొని సర్వసమృద్ధిమంతంబగు వరుణలోకవిశేషము లన్నియుం జూపించెను. తిన్నగా వరుణుని కుమారునికడకుఁ దీసికొనిపోయి మాతలీ! యీతండు పుష్కరుండనువాఁడు. వరుణుని పెద్దకొడుకు. రెండవమహాలక్ష్మియనం బ్రభగాంచిన జ్యోత్న్సాకళయను సోముని పుత్రిక యితని స్వయంవర