పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/264

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుణకేశినికథ.

251

నెఱింగింపుము దానిం గావించి నీచే స్తోత్రముల నందెదంగాక.

మాతలి - స్వామీ! దేవతలు సంతానశూన్యులగుటనే సుఖపడుచున్నారని తలంచెదను.

నార – అట్లనుచున్నా వేమి?

మాతలి — మఱేమియుం గాదు. వినుండు. మాతృసాంప్రదాయంబునంబట్టి నాకొక యాఁడుపట్టి పుట్టినది. మీరెఱుంగుదురా?

నార - ఎఱుఁగ కేమి! యామె జతకర్మోత్సవమునాఁడు నే నందులేనా! ఆబాలికామణి సౌందర్యాతిశయము మెచ్చికొని ముద్దు పెట్టుకొని దీవించలేదా?

మాతలి — ఔను స్వామి మఱచిపోయితిని. మీరులేనిదే దేవలోకములో నుత్సవము జరుగునా? ఆబాలిక యిప్పుడు సంప్రాప్త యౌవనయైయున్నది. వరాన్వేషణమునిమిత్తముబయలుదేరివచ్చితిని.

నార — స్వర్గలోకములో నెక్కడను దగినవరుఁడు దొరకలేదా?

మాతలి - స్వర్గమందేకాదు. మర్త్యలోకమునఁగూడ దొరకలేదు.

నార -- మఱి యిందేమిటికి వచ్చితివి ?

మాతలి — పాతాళలోకమొకటి చూడవలిసియున్నది. అందులకై యిందువచ్చితిని. నేనెప్పుడు నాభువనము చూచియెఱుంగను. అందులకు బోవుమార్గముగూడ నాకుఁ దెలియదు. మునీంద్రా! మీరు శ్రమయని తలంపక యిప్పుడు నాతో వచ్చి యాలోక విశేషంబులు జూపింతు రేనిమీకెల్లకాలము కృతజ్ఞుఁడనై యుండెదననుగ్రహింపుఁడు.

నార - మాతలీ!నన్నిందులకై యింతగా స్తుతియింపవలయునా? నేనిప్పుడు వరుణలోకమునకే యరుగుచుంటి పోవుదమురమ్ము. నీకధో భువనవిశేషములన్నియుఁ జూపుదునుగాక. అని పలికి నారదుఁడు మాతలిని వెంటబెట్టుకొని సముద్రములో మునింగి వరుణనగరమునకు దీసికొని పోయెను. వరుణదూతలు నారదునిరాక జూచి వరుణున