పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/263

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మాతలి భార్యమాట పాటించి భూలోకమంతయు మూడుసారులు తిరిగి విద్యాయౌవనబలమదర్వితు లగు క్షత్రియకుమారులఁ గులళీలవిద్యాతపస్సంపన్నులగు మహర్షిపుత్రుల నిశ్శేషముగాఁ బరిశీలించి తనకుమారితకుఁ దగిన లలితు నెందునుం గానక విసిగి యింటికివచ్చి భార్యకావృత్తాంత మెఱింగించెను.

ఆమె ఔరా! స్వర్గమర్త్యలోకములలో నొక్క చక్కని యువకుఁడు దొరకకపోయెనా! సీ! మృదుసత్యులకుఁ గన్యక జనించుట కంటెఁ గష్టములేదు. కన్యక పితృకులము మాతృకలము భర్తృకులము మూడుకులములకు వన్నె తేవలయును. చూచిచూచి రత్నమువంటిపిల్ల నసమానరూవుండగు వరునకిచ్చి యెట్లు పాణిగ్రహణము చేయఁగలము? మనోహరా! కష్టపడి రెండులోకములు తిరిగితిరి గదా! భోగిస్థానమైన పాతాళలోకముగూడఁ జూచి రండు. అందును దొరకనిచోఁ బిమ్మట విచారింతము గాక. అని యుపదేశించుటయు మాతలి భార్యమాట జవదాటనివాఁ డగుట నప్పుడే సుధర్మకు మ్రొక్కి ప్రదక్షిణము చేయుచు భూలోకమున కరిగెను. అందు దైవికముగా నారదమహర్షి యెక్కడికొ పోవుచు నతని కెదురుపడియెను.

మాతలి - (నమస్కరించి) మునీంద్రా! నేనింద్రసారధిని, మాతలిని.

నారదుఁడు — (ఆశీర్వదించుచు) మాతలీ! నీ వీ భూతలంబున కేమిటికి వచ్చితివి? మహేంద్రుఁ డెందైనఁ బనిగలిగి పంపెనాయేమి ?

మాతలి - లేదు స్వామి. స్వీయకార్యమునకే వచ్చితిని.

నారదుఁడు -- మే మక్కార్యవిధానము వినవచ్చునా?

మాతలి - సరి సరి. మూడులోకములలో మీరువినని రహస్యము లున్నవియా ! మీరు వినుటయే కాదు. పూనుకొని యాకార్యము సేయవలసియున్నది.

నార — ఇంతకన్న నత్యాహితమేమియున్నది ! సత్వరముగా