పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/256

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవకన్యలకథ.

243

నేను దాళధ్వజుని కుమారుండఁగదా! మేమేవుర మన్నదమ్ములము పశ్చిమ దిగ్విజయము సేయఁ బయలుదేరినమాట వాస్తవమే? యుమాపురంబున శ్రీధరునిం జయించి యతనికూఁతుం గమలాదేవిని మాయన్న శ్రీముఖుఁడు బెండ్లియాడినమాట యబద్ధముకాదు గదా? తరువాత క్రోధనునిం జయింప నోడలెక్కి మేమునలువురము సముద్రములోఁ బ్రయాణముసేసినపని యదార్ధముగానే తోచుచున్నది. సంద్రములోఁ గని తగిలి యోడ మునుఁగుటయు నిక్కువమే. అక్కడి నుండి జరిగినచర్య యంతయు నిజముకాదు. స్వప్నమనుకొనియెదను. ఆ! ఏమి! ఒకవేళ మొదటినుండి జరిగిన చర్యలన్నియు స్వప్నోపలబ్ధము లేమో! అన్నియుంగావు తెలిసినది. నేను సముద్రములోఁబడి మృతి నొందితిని. 'యాం తెమతిస్సాగతి!.' అను నార్యోక్తి ననుసరించి నా బుద్ధి యప్పుడు నాయభీష్ట దేవతయగు గాయత్రీమహాదేవిపై వ్యాపించుటంజేసి యిట్టి వినోదములన్నియు నాకుఁ గనంబడుచున్నవి. ఇదియే తథ్యము. నేను సమసి గాయత్రీ సాయుజ్యము నొందితిని. ఇఁకనాకుఁ బునర్భవదుఃఖములేదు. ఇదినాకు సాలోక్యముక్తియని తలంచెదను. ఇఁకఁ గర్తవ్యమేమి యున్నది. ఆకోనేఱులో స్నానముజేసి యాపుష్పములచే నిత్యము గాయత్రీదేవింబూజించుచుఁ గాలక్షేపముజేసెదం గాకయని యాలోచించుచుఁ గూర్చుండియే కునుకుపాట్లుపడఁజొచ్చెను.

నిశ్శబ్దముగానున్న యాసమయంబున నాకశమునుండి యెవ్వరో యక్కడికివచ్చుచు మాట్లాడికొనుచున్న సందడివినంబడినది. ఆరొద విని యతండదరిపడిలేచి నలుమూలలు పరికించెను. ఆధ్వని యాకాశముమీఁదుగా వచ్చుచున్నట్లు తెలిసికొని బయలకుఁ బోయి తల యెత్తి చూచెను. ఆకసమునుండి యెవ్వరో క్రిందికి దిగుచున్నట్లు తెలియబడినది. తద్ధారితములగు రత్నమండపములఁ బ్రతిఫలించి నక్షత్రపుంజములవలె మెఱయుచున్న వెన్నెల తళ్కు లతని కన్నులకు