పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/255

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గీ. పాసె నంబుధినీదు నాయాసమెల్ల
    నడఁగె నుపవాసములు సేసినట్టి యార్తి
    సడలె భ్రాతృవియోగసంజాతభేద
    మంబ ! నీమూర్తినిజూచినయంత నాకు

తల్లీ! నేనాపత్సముద్రంబున మునుంగుచుశ్రీవల్లభునిధ్యానింపఁబూనిన నానోటినుండి యప్రయత్నముగా భవదీయస్తుతి వచనంబులు వెలువడిన వీ వస్మధభీష్టదేవత వగుట నామొర నాలించి నన్నట్టె గట్టునంబారవైచి యిందుఁ బ్రత్యక్షంబై నన్నుఁ గృతార్థుంజేయఁబూనితివి. అంబా! నీదయకు మేఱయున్నదా ! అని యనేకప్రకారంబుల స్తుతి యించుచుఁ దత్పాదపీఠంబునఁ బూజింపబడియున్న వింత లతాంతంబులం జూచి యాయద్భుత సౌరభ్యంబు తత్కుసుమ సంజాతంబని యెఱింగి యాపూవులు వాడక యప్పుడేకోసి పూజించినట్లుండుట కాశ్చర్యపడుచు నవి కల్పతరుప్రసూనములేమో యని యాలోచించుచుఁ దత్పాదపీఠమున సాష్టాంగనమస్కారము గావించి యాపుష్పంబుల నెత్తి విమర్శించుచుఁ బరిమళము వెదజల్లుచుండఁ గ్రమ్మఱ నామహాదేవీ నామంబు లుచ్చరించుచుఁ బూజించి మఱియుమఱియు వినుతించుచు భక్తివివశుండై యా రాజకుమారుండు పెద్దతడ వాగర్భాలయుములోనే వసించెను. కొంతసేపుండి వెలుపలకు వచ్చి ముఖమంటపంబునందలి మణిదీపములు పండువెన్నెలలుగాయ నిండువేడుకతో నాలోకింపుచుఁ గొంతతడ వందు విశ్రమించి తరువాత వినోదముగా గుడియావరణములో దిరుగఁజొచ్చెను. కౌముదీ సముదయంబుదెసలసమముగా నెఱజిమ్ముచుఁ గల్పితరుప్రసూనవాసనాచోరకములగు సమీరకి శోరములుమేనికి హాయిసేయ ఱెండుగడియ లాగుడిచుట్టును దిరిగితిరిగి యానందపరవశుండగుచు స్ఫటిక శిలాఘటితంబగు ముఖమండపపు మొదటి సోపానమునఁగూరుచుండితన రాకనుగుఱించి యిట్లువిత్కరించెను.