పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/252

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవకన్యలకథ.

239

దాని గోడలయందు శక్తివిగ్రములు వ్రాయంబడియున్న వి. తలుపులు మూయఁబడి యుండుటచే లోపలికిఁ బోవుట యెట్లోకో యని యాలోచించుచు నతండు గంటల కవాటములు పట్టి త్రోసినంతలోప లిగడియ వేయఁబడనవగుటఁ దటాలునఁ దెరువఁబడినవి.

తన యదృష్టము ఫలించినదని ముఱియుచు నతం డల్లనలోపలనడుగు పెట్టెను. లోపలి యావరణము విశాలముగా నున్నది. గడ్డిమొలవక పుష్పలతలు పెక్కులు నాటఁబడియున్నవి. ఈశాన్య భాగమువ కళ్యాణమంటపము నాగ్నేయమునఁ జిన్నతటాకము ముందు బంగారు సింహ ధ్వజస్తంభము నొప్పుచున్నవి. ఆలయమంత పెద్దది గాకున్నను పైడిరేకులపై నగిషీపని విశేషముగాఁ జేయఁబడి స్థాపింపఁ బడుటచేఁ గన్నులకు మిఱుమిట్లు గొలుపుచున్నది. ముఖమంటపము స్పటికశిలలచేఁ గట్టబడి మెఱయుచున్నది. ద్వారశాఖలయందు ద్వారపాలికా విగ్రహములు స్పటిక శిలలచేతనే చేయఁబడియున్నవి. వాని గుప్పిళ్ళలోఁ దళతళలాడు నినుపకత్తు లునుపఁబడియున్నవి. తలుపులు మూయఁబడియుండుటచేలోపలిదేవతయెవ్వరో తెలిసికొసలేకపోయెను.

స్తంభముల మంటపములఁ గుడ్యములఁ దఱుచుగాఁ మూడు కన్నులుగల శక్తివిగ్రహములు వ్రాయఁబడియుండుట సింహధ్వజము గలిగియుండుట నరసి యతం డద్దేవళము దుర్గాలయమేమో యని యాలోచించుచుండెను.

అప్పుడు సూర్యాస్తమయమగుచున్నది. ఏది యెట్లైననేమి చీకటిపడకమున్ను తటాకములో స్నానముజేసి జలంబులఁ గ్రోలుట లెస్సయని తలంచి తిన్నగాఁ దటాకముకడ కరిగి సోపానములు క్రొత్తగాఁ గట్టఁబడినట్లొప్పుచుండుటకు విస్మయమందుచు నింద్రనీలచ్ఛాయాసదృశంబులై పుష్ప వాసనా వాసితములగు తజ్జలంబులమునింగి యవగాహనస్నానము గావించి వార్చి యమృతమును దిరస్కరించుఁ