పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/249

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

కాశీమజిలీకథలు - పదియవభాగము.

జన పరాణుఁడైన నారాయణుని ధ్యానింపఁబోయి యాది శక్తి నభినుతించితినేమి! ఔను పరదేవత నా కభీష్టదేవత యగుట సంకల్పింపక పోయినను నాబుద్ధి యామాతమీఁదఁ బోయినది. అదియు శుభ సూచకమే. అని మఱియును

శా॥ సంసారాంబునిధి న్మునుంగుచు సుహృజ్జాయాదివాస్స్వత్వముల్
      హింసింపం గడగాన కూర్మిచయముల్ హృత్ప్రజ్ఞ సర్వంబువి
      ద్వంసంబుం బొనరింపఁ బూర్వ సుకృత వ్యాప్తిన్మురా రే! హరే!
      కంసారే! యనినిన్ దలంపఁ దరి జక్కంజేర్పవే యీశ్వరా॥

అని ధ్యానించుచు నాదోనెను విడువక గొట్టుకొని పోవుచుండెను. నిద్రాహారములులేక రెండుదినము లాసముద్ర జలంబునం దేలియాడుచు నతండు పెద్దదూరము గొట్టికొని పోయిపోయి క్రమంబున నీరసము బలసి స్మృతిదప్పి కన్నులు దెరువలేక యాపట్టెనంటి పండుకొని యుండెను.

మూఁడవనాఁటి యుదయమున కాదోనె యొకచోఁ దీరమునకు జేరి యలలరాపిడి తలక్రిందగుటయు నతండు నీటిలోఁబడ కాలికి నేల దగిలిన నతని కించుక తెలివివచ్చినది. కన్నులు దెరచిచూడ భూమియు నందు వృక్షలతాదులు నతనికి నేత్రపర్వము గావించినవి. అప్పు డతని కెక్కడలేని బలమువచ్చి యట్టెలేచి నిలువంబడియెను. తీర భూమి కొంతదూర మిసుగగానుండెను. ఒడ్డుచేరి యతం డాలోచించి యాయిసుగలో జిన్న చెలమ దీయుటయు నందు మంచినీ రూరినది. అనీటిచే స్నానముజేసి కడుపునిండ నీరుగ్రోలికొంచెము సత్తువజేరగనే కట్టుగుడ్డ లారవై చుకొని యాభూమి పరికించి చూచెను.

జన సంచారమేమియును లేదు. తీరభూమియంతయు మహారణ్యముగాఁ నొప్పుచున్నది. అప్పుడతం డాహా ! పరమేశ్వరుని విలాసములు కడుచిత్రములు. మదభీష్ట దేవత నామొర నాలించి తీరమును