పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/245

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

కాశీమజిలీకథలు - పదియవభాగము.

యుందెలిసినపిమ్మటఁగాని పోరఁదొడంగరాదుచుఁడీ. అని యెన్ని యో నీతి వచనము లుపదేశించి యెట్ట కే వారిని విడిచివచ్చెను.

నావికులు నేర్పరులగుట గాలి ననుసరించి సముచిత వేగంబున నావల నడిపించు చుండిరి. రాజపుత్రులు నలువురు నాలుగుతరులపైఁ గూర్చుండిరి. విక్రముండు ముందు నడుచు నోడపైఁ గూర్చుండి కర్ణ ధారులలోసమయవేదియనుప్రధాననావికునిఁదనకడనుంచికొని వరుణావతీ వృత్తాంతముస విశేషముగా నెఱింగింపుమని యడిగిన వాఁడిట్లనియె.

అయ్యా! నేను బిన్నటినాటినుండియు నీయోడలమీఁదఁ దిరుగుచుంటిని. అనేకద్వీపములకుఁ బోయితిని కాని వరుణావతీ నగరంబున కెప్పుడును బోవలేదు. ఆరాజు కడు క్రూరుఁడు. రావణాసురునివంటి వాఁడట. భూపతులెల్ల నతనిపేరువినిన గడగడ లాడుచుందురు. వరుణ ద్వీపము నూఱామడ వైశాల్యము గలదఁట. సముద్రములోఁ జుట్టును గనులువైచి యుంచెను. వానియునికిఁ దెలియక యోడలనడిపించినచో నవి తగిలి భగ్నములై పోవుచుండును. క్రోధనుని యోడలు వానిం దప్పించుకొని యెల్లదీవులకు సంచారము సేయుచుండు. మా శ్రీధరుఁడా క్రోధనునకుఁ బన్ను గట్టు చుండును. వానిజయించు వారి నిప్పటికిఁ జూచియుండలేదు. మీరెట్లు జయింతురో తెలియదు. మీరు బాహుబల సంపన్ను లగుదురుగాక. ఒక యంత్రము గడియలో వేలకొలఁది జనమును నాశనము చేయఁగలదు. ద్వంద్వ యుద్ధములో మీరు వాని నోడింతురుగాని వాని దాపునకు మీరెట్లు పోఁగలరు. పట్టణమే చేరుటకష్టము. వరుణావతికిఁ బదియోజనముల దూరములో మిమ్మ్ము తీరము జేర్తుము. మీ రాయూరిలోని కెట్లు పోవుదురో తెలియదు. మీ సంకల్ప మేమియో నాకుఁ దెలియకున్నది. అని యాకర్ణధారుం డెఱింగింప నాకర్ణించి విక్రముఁడిట్లనియె.

ఓయీ! నీమాటలు నాకు సంతోషము గలిగించినవి. క్రోధ