పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/244

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమదిగ్విజయము.

231

మించజాలదు. మీ మామతోఁ జెప్పి మాపయినము సాగింపుము తూరుపుదెసకరిగిన మనయన్న లెట్లింటికివచ్చిరో జ్ఞాపకమున్నదా! పోయిన నట్లె యింటికిఁ బోవలెను. లేకున్న నదిలోఁ జావవలసినదే. అని సాటోపముగాఁ బలుకుటయు శ్రీముఖుఁడు మామగారితో వారి యుద్యమప్రకార మెఱింగించెను.

వారు క్రోధనుని జయింపఁజూలరని యెఱింగియు నల్లుఁడు పోవుట మానెంగావున శ్రీధరుఁడెట్ట కే వారి పయనమున కొప్పుకొని, పదుగురఁ గర్ణధారుల రప్పించి యిట్లనియె.

మీరు వరుణావతీ నగరంబునకు నోడలఁ దీసికొని పోవలసియున్నది. మా బంధువుల సేనలతో వరుణ ద్వీపము జేర్పవలయును. సముద్రములోఁ క్రోధనుఁడు వైపించిన యంత్రపుగనుల స్థానములు మీకుఁ దెలిసియే యుండును. వానికిఁ దగులకుండ జాగరూకులై వీరిని వరుణావతికిఁ బదియోజనముల దూరముగా దక్షిణపువైపు దీరమున దింపవలయును. వారక్కడనుండి యెట్లో సాధనము జేసికొని పురిలోఁ బ్రవేశింపఁగలరు. వాతాగ్నిజల ప్రమాదము లెఱిఁగి యోడల నడిపింపుఁడు. ఎప్పటికప్పుడు మాకు వార్తల దెలుపుచుండ వలయునని యా మార్గ ప్రవృత్తియంతయు నెఱింగించినవిని నావికులు సంతసించుచుండ తదనుజ్ఞవడసి మూడు దినములతో బయనమునకు బదియోడల నాయత్తఱచిరి. ఉమాపురంబు సముద్రతీరమునందే యుండుటచే వెంటనే వారిపయనము సాగినది. శ్రీధరుఁడు కొంత సేనను వారికి సహాయమిచ్చి పంపెను. శ్రీముఖుఁడు తమ్ముల మంచి ముహూర్తమున నోడ లెక్కించి యింటికి మరలునప్పుడు తాను వినిన వరుణావతీ యంత్ర రహస్యములన్నియుఁ దమ్ములకుఁ దెలియఁ జేయుచు దన కెప్పటివార్తలప్పుడు పంపుచుండవలయు నందులకుఁ బ్రత్యేక మొకయోడ మీ వెంటఁ బంపఁ బడుచున్నది. వాని మర్మము లన్ని