పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/239

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

కాశీమజిలీకథలు - పదియవభాగము.

యడ్డు పెట్టినవారినెల్ల భల్లంబుల నేయుచుండ నతిరయంబున దమ నెలవునకుం దీసికొనిపోయి యంతర్భవనంబునం బ్రవేశపెట్టెను,

అరెరే! ఎంతమోసము జరిగినది. ఆక్షుద్రులు కన్యనెత్తుకొని పోవుచుండ నడ్డుపడ కూరక చూచుచుంటిమేల? అది మన కవమానముగాదా? అని రాజకుమారులెల్ల హల్లకల్లోలముగా రొదజేయుచు లేచి యాయుధంబులఁదాల్చి వాండ్రెందున్న వారోచూడుఁడు, పట్టుఁడు, కొట్టుడు. అని వీరాలాపము లాడుచు వీధిం బడిరి.

శ్రీధరుండును సెలవీయనిదే వాండ్ర లోపలి కేమిటికి రానిచ్చితిరని ద్వారపాలుర నిందించుచు నానీచులఁ బట్టి కట్టితెండని వీరభటుల నియోగించుచు నుత్సవభంగము గలిగినదని బంధువులతో విచారించుచు నావీరపురుషు లెవ్వరు? ఎట్టివారని మంత్రులతో నాలోచించుచు యుద్ధోన్ముఖులగు రాజపుత్రుల వలదని యనునయించుచుఁ బుత్రికావియోగదుఃఖితులగు నంతఃపురకాంతల నూరడింపఁదగిన వారిఁ బుచ్చుచు నేమిచేయుటకుఁ దోచక వారెందున్నవా రెక్కడికి దీసికొని పోయిరో తెలిసికొనిరండని కొందఱ వాఱువపు రౌతుల ననిపెను.

వాండ్రు పోయివచ్చి దేనా! వారాపల్లపువీధి సత్రముదాపున నున్న పెద్దమేడలో మనరాజపురుషులచేఁ బ్రవేశపెట్టబడినవారే. వారి నా స్వయంవరసభకు రావలదని మీరు నిషేధించినారఁట. భర్తృ దారిక నాయింటిలోఁ బ్రవేశపెట్టి వారేవురు గుఱ్ఱములెక్కి ద్వారమునఁ గాచికొనియుండిరి. ఇంతలో నీస్వయంవరమునకు వచ్చిన రాజకుమారులు దేవరపంపిన వీరభటులు పటకోపముతోఁ బోయి యా వీధి ముట్టడించి వారిపై , నాయుధములఁ బ్రయోగించుచుఁ బోరుగా వించుచున్నారు.

ఆవీరపురుషు లైదుగురు గుఱ్ఱముల జిత్రగమనంబుల నడిపించుచు సింహనాదములు సేయుచు నిర్వక్రపరాక్రమంబున విజృంభించి