పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/237

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

కాశీమజిలీకథలు - పదియవభాగము.

మూల నున్నదియో మాకుఁ దెలియదు. మీకులశీల నామాదులు మాకంతగా నచ్చినవికావు. మీకాహ్వాసపత్రికలు మేము పంపియుండలేదు. నాకూఁతుం బ్రరిగ్రహించుటకు మీరర్హులుకారని నాకుఁ దోచినది. మీరిందువచ్చినందులకు మాకుఁదోచిన కనకాంబర వస్తు విశేషములిందుతోఁ బంపితిమి. వీనిం గైకొని మీరు మీగ్రామంబున కరుగవచ్చును. ఇట్లువ్రాసినందులకు మాపైఁ గినియకుందురుగాక!

అనియున్న పత్రికం జదివికొని వారేవురు నౌరా ! యీరాజునకెంత పొగరున్నది ? మన కులశీలాదులు తనకు నచ్చలేదఁట. తమ పిల్లను జేసికొనుటకు మనమర్హులము కామఁట. ఏమి ? యీగర్వము ! ఏమి యీస్వాతిశయము ! రాజులు స్వయంవరము చాటింపరో! రాజకుమారులు పోవరో ! తనకుమార్తె కిష్టములేకున్న వరింపక పోవచ్చుంగాని యిట్లు సభకే రాఁగూడదని నిషేధించుట యెందును జూచి యెఱుంగము. మమ్మేకాక యిట్లు పెక్కండ్ర నిరాకరించినట్లు తెలియుచున్నది. రాజవంశసంజాతున కింతకన్న యవమానము మఱి యొకటి కలదా ! ఇట్లు చేయుట తప్పని యప్పతిం బట్టికొని కాలిక్రిందఁ ద్రొక్కి పెట్టి యడుగుదుముగాక. అని రౌద్రావేశముతోఁ సర్పములవలె బుసకొట్టుచు వారూహించుకొను చుండిరి.

అట్లు నిరాకరింపఁబడిన రాజపుత్రుల పెక్కండ్రు శ్రీధరుని బలాధిక్యమునకుఁ వెఱచి తామేమీయుఁ జేయఁజాలక సిగ్గుతో నొకరితోనొకరు జెప్పికొనక తమ తమ నగరములకుఁ బోయిరి. మఱి నాలుగు దివసములకు స్వయంవర సభ జరిగినది. ప్రఖ్యాతసంపత్కుల విద్యా యౌవనబలగర్వితులగు రాజపుత్రులెల్ల నాసభ నలంకరించిరి. అప్పుడు కమలాదేవి కమలాదేవివలె నొప్పుచుఁ బుష్పదామంబు చేతంబూని సఖినివేదితములగు రాజపుత్రుల చరిత్రము లాకర్ణింపుచు నాసింహాసన శ్రేణీమధ్యమునుండి దేవదానవులనడుమ దిరిగెడి