పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/236

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమదిగ్విజయము.

223

డ్రులకుఁ జెప్పకయే పశ్చిమదిగ్విజయముసేయఁ బయలుదేరి కంకణ టెంకణసౌరాష్ట్రాదిదేశముల కరిగి యందలిభూపతులచేఁ బూజింపబడుచుఁ బుణ్యతీర్థంబుల సేవించుచు గొన్నిదినములుదేశాటనము గావించిరి.

మహారాష్ట్ర దేశాధిపతి శ్రీధరుండను మహారాజు తనకూఁతురు కమలావతికి స్వయంవర మహోత్సవము చాటించుటయు నయ్యుత్సవమునకుఁ బేరుపొందిన రాజకుమారులు చతురంగ బలములతోఁ డద్రాజధానియగు నుమాపురంబున కరుగుచుండిరి. అవ్వార్త విని తాళధ్వజునిపుత్రు లేవురు ప్రహర్షాతిశయముతో నవ్వింతజూడఁ గతిపయప్రయాణంబుల నన్నగరమున కరిగిరి.

రాజశాసనప్రకార మానగరము చేరినవారినెల్ల గౌరవింపుచు దగిన విడిదలం బ్రవేశపెట్టి వారివారి కులశీల నామాదులం దెలిసికొని నృపతికిందెలియఁజేయుచుండును. శ్రీముఖాదులంగూడసత్కరించి మంచి సౌధంబున బ్రవేశపెట్టి వారిపేరులు బిరుదములు గ్రామము కులము వ్రాసికొనిపోయిరి.

ప్రఖ్యాత విద్యాసౌందర్యవిభవాభిరామలగు వామలకుఁగాని స్వయంవరము చాటీంపరు. కన్యకకుఁ దగిన వరు నరయ తిరిగితిరిగి విసిగి యనురూపం బడయజాలక శ్రీధరుం డారమణీమణికి స్వయంవరవిధి నిరూపించెను. ఆరాజు పూర్వాచారపరాయణుఁడు. ధర్మశీలుఁడు బలశాలి, విద్యాధన గర్వితుఁడు. ఆయుత్సవమునకు వచ్చిన రాజపుత్రుల చారిత్రములఁ దెలిసికొని యనుకూల సాంప్రదాయ విద్యాబలశీల సంపన్నులని నమ్మకముదోచిన వారినిం దప్ప నితరుల నాయుత్సవమునకు రానిచ్చుటలేదు.

అట్టివారిం బెక్కండ్ర నిషేధింపుచుండెను. వారితోఁ జేర్చి తాళధ్వజుని పుత్రులగూడ నాసభకు వచ్చుట కంగీకరింపక వారికిట్లు ప్రత్యుత్తరము వ్రాసిపంపెను. రాజపుత్రులారా ! మీరాజ్య మే