పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/232

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారుమతికథ.

219

వారట్లు మాటాడుకొనుచుండఁగనే హరివర్మను వెదకికొనుచు దమ్ములు మువ్వురు గుఱ్ఱములెక్కి, యక్కడికివచ్చిచేరి యన్నల నిద్దరఁ జూచి యోహో ! పెద్దన్న విద్యాసాగరుఁ డిక్కడికెట్లు వచ్చెను నీకొఱకు నడవియెల్ల వెదకికొనుచు దైవికముగా నిక్కడికివచ్చితిమే అని పలుకుచు మువ్వురు నతని పాదంబులఁబడి నమస్కరించిరి. వారిం గ్రుచ్చియెత్తి యాదరించుచుఁ బదుఁడు లోపలకుఁ బోవుదము. మా పుత్రుఁ జూతురుగాక మంచి సమయమున కే కలిసికొంటిమి. నా కథ చాలకలదు. ఆనక జెప్పెదంగాక యని పలుకుచు రాజప్రధానులపై నీళ్లుజల్లించి సేద దీర్పించిరి. ఇరువురులేచి కూర్చుండి హరివర్మఁజూచి సిగ్గుపడుచుండ నూరడించి విద్యాసాగరుఁ డిట్లనియె.

మామా! వీరు నలువురు నా తమ్ములు నిజము దెలిసికొంటి. మీద్వార పాలునివలన నాకయ్యము బొడమినది. మీరైనను నీ వెవ్వండవని యడుగక తొందరపడి కయ్యములో దిగితిరి. వానిగెలువ మీ తరమా! మంచివాఁడుకావున మిమ్ము గడ తేర్పక యవమానపరచి విడిచి వేసెను. రండు! రండు! లోపలకుఁ బోవుదము అని వారి వృత్తాంతమంతయు వారికింజెప్పెను. హరివర్మతన తప్పు క్షమింపుమని రాజుఁగోరికొనియెను. ఆనృపతివారినెల్లలోపలకు దీసికొనిపోయిమిగుల గౌరవించుచు సంతోషముతో వారికథ తమ బంధువుల కందఱకుం దెలియఁ జేసెను. విద్యాసాగరుండు తగువారింబంపి యడవిలోనున్న తమ్ములభార్యలను సపరివారముతో రప్పించి ప్రమద్వర యంతఃపురమున కనిపెను. కుమారునికి తాళధ్వజుఁడని పేరుపెట్టిరి. ఆశిశువును లాలించుచు నాఁడెల్ల వారందఱు తమ పడిన కష్ట సుఖంబుల నొండొరులకుఁ దెలియఁ జేయుచుండిరి.

చ. అని యెఱింగించి యత్తపసి యౌర! ప్రయాణపువేళమించిపో
    యినదిగదా! కథాగత సమీడ్య లసత్ప్రతిభా చమత్కృతిం