పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/230

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారుమతికథ.

217

హరివర్మగుఱ్ఱమునుజుట్టుకొని కొట్టఁబోవుటయు నతం డవలీల వారి నందఱ గుఱ్ఱముచేఁ ద్రొక్కించి కాందిశీకులఁ గావించెను. దండనాధుండు దెబ్బలుతిని గొబ్బునలోపలికిఁబోయియావీరుఁడు సామాన్యుడు కాడు. గొప్పప్రయత్నమునంగాని వాఁడు పట్టుబడఁడు. మఱికొందఱ యోధులం బంపుఁడని నృపతి కెఱింగించుటయు నందున్న వారినందఱ దీసికొనిపొమ్మని యజ్ఞాపించెను.

దండనాధుఁడు పెక్కండ్రయోధులం దీసికొనిపోయి హరివర్మతో నాయోధనముజేయఁదలపెట్టెను కాని గడియయైన నాతనిముందర నిలువలేకపోయిరి. వారినందఱ గుఱ్ఱముచేఁ ద్రొక్కించి పారిపోవ జేసెను. రాజు యతం డసాహాయశూరుండని తెలిసికొని మంత్రితో నాలోచించి యీయుత్సవమున కంతరాయముగాకుండ నల్లునికిఁ దెలియకుండ మనము పోయి వానిపౌరుష మేపాటిదియో చూతము గాక అని నిశ్చయించి యేదియో నెపముపన్ని యిరువురు నట కదలి కవచంబుల దొడిగి శరశరాసనంబులం దాల్చి గుఱ్ఱములెక్కి సింహ ద్వారముకడకుఁ బోయిరి.

అందు యోధులు పెక్కండ్రు మూర్ఛజెందియుండిరి. రాజు వారింజూచి కోపమాపలేక నీవెవ్వండవని యడుగకయే తనగుఱ్ఱ మతనిమిఁదికిఁ దోలెను. వెంటనే మంత్రియు గొందఱు భటులు వానిం జుట్టుకొనిరి. అప్పుడు హరివర్మయం దొకభటుని చేతనున్న కరవాలము లాగికొని రౌద్రావేశముతో వాఱువమును బెండెములు త్రిప్పుచు రాజప్రధానుల కిరీటముల శకలములగాజేసి భుజకీర్తుల నరికి వారి నిరువురఁ దురంగములనుండి క్రిందఁబడనేసి మూర్ఛ నొందించెను. లోపల రాజుగారి యల్లుఁడు బ్రాహ్మణాశీర్వాదమంది పీటలమీఁదనుండిలేచి మామగారికి నమస్కరింప నెందున్నవారని యడుగుచుండఁగనే కొందఱు భటులు పటురయంబువ హాహాకారము