పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/229

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

కాశీమజిలీకథలు - పదియవభాగము.

ఇంచుక యలుకజెంది హరివర్మ గుమ్మము దాపుగా గుఱ్ఱమునుదోలి యొకనితో నోయీ ! ద్వారపాలుర కింత యవివేకము తగదు. బాటసారితో మాటాడినంతనేయధికారము కొరంతయగునా? నామాట వినిపించుకొంటిరి కారిది మర్యాదయే యని యడిగిన స్థానబల గర్వంబున వారిట్లనిరి. అబ్బో ! గుఱ్ఱమెక్కినవారందఱు రౌతులేకాఁబోలు. మమ్ము ధిక్కరించి యడుగుచుంటివి ? నీవెవ్వఁడవు ? నీమాటల కుత్తరము చెప్పుటకు మాకవసరములేదు. గుఱ్ఱము దిగి మాటాడుము. నిన్నుఁ బరీక్షించి కాని పోనీయమని పలికిన, నతండు రౌద్రావేశముతోఁ దులువా ! యేమంటివి ? నిలువుమని పలుకుచుఁ దనచేతనున్న కొరడాతో వాని నొకదెబ్బ కొట్టెను.

అప్పు డందున్నవా రందఱులేచి గుఱ్ఱమును జుట్టుకొని యతని నదలింపఁబోయిరి. అతండు మొలలోనున్న కత్తితీసి గుఱ్ఱమును వారి పైకిఁదోలి త్రొక్కించుచుఁ గొందఱి శిఖలగోసి కొందఱి ముక్కులం జెక్కి కొందఱ చెవులు నరికివారినందఱంబారఁదోలెను. అప్పుడు కొందఱుభటులు లోపలికిఁ పరుగెత్తుకొనిపోయి జాతకర్మోత్సవముజూచుచున్న తన యేలికతో మహారాజా ! మనసింహద్వారముకడ కెవ్వఁడో గుఱ్ఱమెక్కివచ్చి ద్వారపాలురం జంపుచున్నాడు. తగినవారిం బంపిన గాని వాని యౌద్ధత్యము మానుప శక్యముగాదని తెలియఁజేసిరి.

అప్పుడు కూఁతురు నల్లుఁడు పీటలపైఁ గూర్చుండి శిశువునకు జాతకర్మ చేయుచుండిరి. ఒకమూల వారాంగన లాడుచుండిరి. యొకమూల బ్రాహ్మణులు వేదములు చదువుచుండిరి. సామంతులా యుత్సవముజూచి యానందింపుచుండిరి. అట్టితఱి నీవార్త వచ్చుటయు రాజు ప్రక్కనున్న మంత్రితోఁ గనుసన్నఁజేసెను.

ఆసచివుండు దండనాధుం బంపెను. ఆసేనాధిపతి పదుగురు కింకరులతోఁ బోయి ద్వారపాలురపాటు జూచి రోషముదెచ్చుకొని