పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/225

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నన్నారక్కసుఁ డిక్కడికిఁ దీసికొనివచ్చినాఁడు. మీరేనాభర్తలు. అని పలుకుచు నానందాశ్రువులతో నాదామము నామెడలో వైచినది. నేనును దత్పత్నీత్వమున కనుమోదించి యాదరించితిని. ఇరువురమక్కొండశిఖరంబునఁ చిలుకలగుంపులఁ బరిశీలింపుచుఁ గొన్ని దినములు వసించితిమి. ఒకనాఁడు నే నిట్లంటిని. రమణీ! మాసోదరు లీకూటంబున నున్నట్లులేదు. ఇప్పర్వతమున కుత్తరభాగంబున నొక్కపట్టణమున్నదఁట. ఇందు లేకున్న నందుఁబోయి వెదకుమని యాసిద్ధుండాన తిచ్చియున్నవాఁడు. కావున మనమందుఁ బోవలసియున్నది. నీవెట్లు దిగుదువో యని యాలోచించుచున్న వాఁడ నిక్కొండ దిగు పాటవము నీకుఁ గలదా! అని యడిగితిని. ఇట్లు చేయరాదా? అని యాచిన్నది నాకుపాయము చెప్పినది. దానిబుద్ధినైపుణ్యమునకు నేను సంతోషించుచు నప్పుడే యొక వెదురు గొట్టము బాగుజేసి దానినిండ నాతటాక జలంబెక్కించి చీల బిగించి యామూలికలు దానితోఁ జేర్చికట్టి చారుమతిచే నాకొలనినీరు ద్రాగించితిని. అక్కలికి చిలుకయై నిలువంబడినది. దాని కాలికిఁ ద్రాడుకట్టి చేతికిఁ గట్టికొంటిని.

ఆవెదురుగొట్టముకట్ట బుజముమీఁద బెట్టుకొని దాన్ని పైఁ జిలుక నెక్కించి యొకప్రక్కనుండి యక్కొండదిగుటకుఁ బ్రారంభించితిని. అప్పుడు నాకుఁ గొండదిగుటకంటె నెక్కుటయే సులభమని తోచినది. క్రిందుఁజూచిన నగాధముగాఁ గనంబడును, ఒక్కొక్కచోట నూఁతివలెనుండుటచే నతికష్టముమీదఁ దిగఁగలిగితిని. క్రిందికి దుమికి కాలుజారిన వృక్షశాఖలం బట్టుకొని యాగుచుండెడి వాఁడను. ఈరీతి నతికష్టంబున నక్కొండ దిగగలిగితిని. కొంతదూరమందుండఁగనే యీ నగరము నాకుఁ గన్నలపండువ గావించినది. దగ్గిరఁ జేరినకొలఁది పురిచుట్టు ప్రహారి గలిగియుండుటంబట్టి యుత్తరముగాఁ బోయి గిరిదిగి బాటలోఁ జేరితిని. వీరవేషంబుతోఁ బోయిన నగరములోనికి బోనీయ