పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/222

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారుమతికథ.

209

నీపేరేమి ? మాతమ్ములవలె నీ వీ తటాక జలంబులఁ గ్రోలి చిలుక వైతివాయేమి? ఈదుర్గమ శిఖరంబున కెట్లువచ్చితివి? నీవృత్తాంతము చెప్పుమని యడిగిన నప్పడఁతి నాకు నమస్కరించుచు నిట్లనియె.

మనోహరాకారా! నే నవంతీశ్వరుని కూఁతురను. నా పేరు చారుమతి యండ్రు. మా తండ్రికి నే నొక్కరితనే పుత్రికనగుట. నాకుఁ బెండ్లిచేయు తలంపుతో వరాన్వేషణము నిమిత్తము భూమండ లంబంతయుఁదిరిగి యెందును దగిన పురుషుం గానక స్వయంవర మహోత్సవము చాటించెను. ఆ యుత్సవమునకు రూప యౌవన మదగర్వితులగు రాజకుమారు లనేకులు వచ్చి సభ నలంకరించిరి.

అప్పుడు నేను దివ్యభూషాంబర మూల్యానులేపనాదుల నలంకరించుకొని యంతఃపురమునుండి బయలుదేరి సఖీహస్తావలంబనంబు గావించి మెల్లగానడుచుచు సభాభవనము చేరునంతలో నొక్క. బ్రహ్మరాక్షసుం డెక్కడనుండియోవచ్చి గ్రక్కున నన్నక్కునం జేర్చికొని యందున్న వారెల్ల హాహాకారంబులు సేయుచుండ నురగింబట్టికొనిన గరుడ పక్షియుంబోలె నాభీలవేగంబున నెగసి యాకాశ మార్గంబునం బడిపోవదొడంగెను.

అప్పుడు నేనుకురరియుంబోలె వాని బుజంబుననుండి వాపోవుచు శోక వేగంబున నొడలెఱుంగక మూర్చవోయితిని. కొంత సేపటికి వాఁడు నన్నీ శిఖరముమీఁదకుఁ దీసికొనివచ్చి యిందు దింపి సేఁద దీర్చుచు నిట్లనియె. సుందరీ ! నేను మధుండను దానవచక్రవర్తిని. గగనంబునం బోవుచు నిన్నుఁజూచి మోహపరవశుండనై యిట్లెత్తికొనివచ్చితిని. భుజబలంబున నాకీడగువాఁడు మూడులోకములలో లేడు. ఇగ్గిరికూటంబుమిధునవిహారమునకు వాటమైయున్నది. యధేచ్ఛముగా మన మిందు సుఖంపవచ్చును. నన్నంటియున్న మదనుం దృప్తిపరచితి వేని నీకు దాసుండనై పరిచర్యలఁ జేయువాఁడఁ గన్నులెత్తినన్నొక