పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/22

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారదమహర్షి కథ.

9

“తాతా! నేనేమితప్పుఁజేసితినని నాకిట్టి దారుణ శాపమిచ్చితివి? సంసారమునకు వగచి విరక్తుండనై తపంబునకుఁ బోయెద ననుజ్ఞయిమ్మని కోరితి నిదియపరాధమా? నాపైనీకీకోపమేలగలుగవలయు. అయ్యో! నేనీపునర్భవక్లేశ మెట్లనుభవించువాఁడ. కటకటా! తండ్రీ! యింతకఠిన శాపమిత్తువే. కానిమ్ము. నే నేజన్మమైన నెత్తుదును. సంతతము హరి పదారవింద ధ్యానమేమరకుండ నాకు వరంబిమ్ము. నీశాపము నన్నేమియుం జేయజాలదు.

క. హరిభక్తి శూన్యడైనన్
   ధరణీసురునైనఁ జెప్పఁదగు నధమునిగా
   హరిభక్తి యుక్తమైనన్
   బురుగైన స్సర్వలోక పూజ్యత వడయున్ .

అని కోరికొనుటయు హాటకగర్భుం డభినందించుచు నారదా! నీవు కోరిన వరమిచ్చితి. నీవు గంధర్వ చక్రవర్తివై హరీభక్తాగ్రేసరుండవై మహాపతివ్రతలగు నేబదుగురు భార్యలతోఁ బెద్దకాలము సుఖించి క్రమ్మర నన్ను జేరుదువు గాక. నీకిది శాపము గాదు వరంబనుకొనుము. శృంగార లీలావిలాసము లనుభవించిన పిమ్మట నంతయు నీకే తెలియఁగలదని పలికి పలుకు కలికి యెకిమీఁడతనిననున యించెను:

అని యెఱింగించిన విని గోపాలుండు ముకుళిత కరుండై మణిసిద్ధున కిట్లనియె. మహాత్మా! నారదమహర్షిని దక్షుండు తనకు బుత్రుండై పుట్టుమని శపించెను కదా! ఆమాటయేమియుం జెప్పితిరి కారేమి? మఱియు బంచభూతములు సృష్టికిఁ బూర్వము లేనట్లు మీమాటలం దేటపడుచున్నది. అప్పుడీ ప్రపంచకస్థానమం దేమి యున్నది? అది యెట్లుండును? చెప్పుమని యడిగిన నవ్వుచు మణిసిద్ధుండు గోపా! నీవు లోతు ప్రశ్నములు వైచుచుంటివే! బాగు