పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/219

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

కాశీమజిలీకథలు - పదియవభాగము.

అని ఆలోచించి తటాకమునకరిగి స్నానముచేసి కన్నులు మూసికొని దోసిలితో జలంబులెత్తి పరమేశ్వరుని ధ్యానించుచు మహాత్మా! నాకు నిరుపమాన సౌందర్యకళాబలపరాక్రమాది విశేషము లొసంగియుఁ జివర కీయడవినడుమ దిక్కు లేక యొక్కరుఁడ దేహమువిడుచునట్లు చేసితివే! ఏమిపాపముజేసితిని. మాతమ్ము లీకష్టము లేమియు నెఱుగకుండ చిలుకలై యెగసిపోయిరి. నాకీజ్ఞాన మేల కలుగవలయును? నన్నుఁగూడఁ దెలియకుండఁ జిలుకంజేసిన బాగుండునే! నాప్రారబ్ధమునునీవెట్లుమార్చుదువు? ముందుజన్మమునందైననిట్టి కష్టములు లేకుండ జేయుమని ప్రార్థించుచు జలపానంబుసేయ నుద్యుక్తుండనగునంతలో నత్తటాకజలాంతరమున గుభాలుమని యొక పెద్ద చప్పుడైనది. అదరిపడి కన్నులం దెరచి చూచితిని. ఆజలమధ్యమునుండి సుడిగుండములువొడమ దోయంబుపొంగి తటంబనగొట్టుకొన

గీ. మూరెడేసిగోళ్లు మోకాళ్లదనుక వ్రే
    లాడుజడలుగల్గి చూడ భీతు
    గదుర నొక్కసత్వ ముద కాంతరమునుండి
    పైకివచ్చెఁ గచ్ఛపంబుపగిది.

ఆసత్వంబు మకరమత్స్య కచ్ఛపాదుల బోలక వేఱొక విధంబున నుండుటంగాంచి నేను వెరఁగందుచు నన్నిది గడతేర్చు నేమో యని వీరపుతోనుండి తచ్చర్యలం బరికించుచుంటి. ఆసత్వంబు క్రమంబునఁ బశ్చిమతటంబుజేరి కూర్చుండెను. అప్పుడు చూడంజూడ మనుష్యాకృతిగా తోచినది సూర్యున కర్ఘ్యప్రదానమిచ్చినంత నేనతండొక దిగంబరియోగియని తెలిసికొంటి. అయ్యోగి కొంతసేపు జపముచేసుకొని లేచి తత్ ప్రాంతమందు నెరయఁబడిన తరుని కటంబునకరిగిదోయిలిపట్టుటయు నందలిఫలంబులు జలజలరాలి కొన్ని వాని దోసిటంబడినవి. వానిం దెచ్చికొని తీరంబునం గూర్చుండి