పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/217

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

కాశీమజిలీకథలు - పదియవభాగము.

దుఃఖించుచు నేమిచేయుటకుం దోచక అయ్యో! నాతమ్ములు చిలుకలైపోయిరి. ఇఁక వారి నీజన్మంబునఁ జూడఁజాలను. ఈతటాకజలంబున నిట్టిదోషముండఁబట్టియే జలచరశూన్యమైనది. మాకర్మమిక్కడి కీడ్చికొనివచ్చినది. మాదిగ్విజయాత్రఫలం బిట్లు పరిణమించినది. అన్నగా రేమైరో తెలియదు. తమ్ములిట్లైరిగదా. నేనొక్కరుండ మిగిలి యేమిచేయువాఁడ బ్రతికినను ఫలమేమి? నేనుగూడ నీనీరు ద్రావి చిలుకనై యీదుఃఖము మఱచి వానితోఁగలసికొనియెదంగాక. ఇంతకన్న వేఱొకమార్గమునుపోవదగినది కాదు. అనినిశ్చయించినీటిదరి కరిగి దోసిట నీరుపట్టి నోటియొద్దకుఁ జేర్చికొని యంతలో మఱల దింపి యిట్లు తలంచితిని.

మ. అకటా? సర్వగుణాభిరాముఁడగు లోకాధీశు పుత్రుండనై
     సకలక్ష్మాతలనాధ సన్నుతయశఃక్షాత్రంబునం బొల్చు వా
     రికిఁ దమ్ముండననొప్పి నిర్జితమహారివ్రాతుఁ డైనట్టి నే
     నొకకీరాధమరూప మూనఁదగునొక్కో ? నీచుచందంబునన్ .

ఇప్పుడు నేనీజలంబులంగ్రోలి శుకంబునై యెగసిపోయిన నాజీవిత మింతటితో సమాప్తినొందెడిని. అంతకన్న మృతినొందుటయే శ్రేయము “జీవన్ భద్రాణిపశ్యతి" అనునార్యోక్తియు విమర్శింపఁదగి నదియే. నేనుగూడఁ బక్షినగుటకంటె సోదరుల పక్షిరూపము మార్చు ప్రయత్నముచేయుట లెస్సయని తలంతుఁ గొంత ప్రయత్నముజేసి చూచెదంగాక యత్నము సఫలముకానినాఁ డీపనిచేయవచ్చును మనష్యుల బక్షులఁజేయు సామర్ధ్య మీతటాకమున కెట్లువచ్చిసదో తెలిసికొనవలసియున్నది. యూరక చచ్చినఁ బ్రయోజన మేమియున్నది. అని తలంచి నాదోసిటనున్నజలం బవ్వలఁ బారజిమ్మితిని.

వెంటనేలేచి యా తటాకమునకు మూడు ప్రదక్షిణములుచేసితిని. ముకుళిత కరకమలుండనై యో కాసారరాజమా ! నీ బ్రభా