పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/214

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరివర్మాదులకథ.

201

ప్రళయప్రభంజనమువలె వీచివీచి మమ్ముఁ బొప్పాకులవలె నెగరఁగొట్టినది. మాయన్న విద్యాసాగరుండొక దెసకును మేము నలువురము నొకదెసకుఁ గొట్టుకొని పోయితిమి. గుఱ్ఱములతోఁ గూడ మేము దూది పింజలవలెఁ బెద్దదూరము పోయిపోయి యొకమహాపర్వతం బవరోధము గలుగజేయుటయుఁ బ్రవాహవేగంబునఁ గొట్టుకొనిపోయిన కట్టియలు తటంబు జేరునట్లు మేము తత్తటం బూతగా నిలువంబడి తొట్రుపడుచుండ నంతలో నాగాలి చల్లారినది. అప్పుడు మేము వాఱువములఁ దిగి యలయికదీరఁ గొంతవడివిశ్రమించితిమి. ముందుకర్తవ్య మేమని యాలోచించితిమి. తిరుగా నట్టి వాతంబు వీచునేమోయని వెఱపు జెందుచు నెట్లుపోవుటకుం దోచక పరితపించుచుంటిమి.

మాతమ్ముఁడు సుధర్ముఁడు మనమిప్పుడీ పర్వతశిఖరమెక్కి నలుమూలలు పరికించి నదులు, గ్రామములు, నరణ్యములు నేమూల నున్నవియో యెట్టిపరిమాణము గలవియో తెలిసికొందము పిమ్మట నప్పటికిఁ దోచిన మార్గంబునం బోవుదమని యుపాయము జెప్పెను. అందుల కందఱము ననుమోదించితిమి.

గుఱ్ఱంబులఘాసక బళంబులఁ మేపితృప్తిపరచి నీరుద్రావించి మేము ఫలాహారములఁదృప్తులమై మంచి వేళయనితోచిన సమయంబునగుఱ్ఱములనెక్కి జయపరమేశ్వరా యని యుచ్చరించుచు నొకని వెనుక నొకఁడు తత్తడిని నడిపించుచు నక్కొండ యెక్క ప్రారంభించితిమి. కొంతదూరము సులభముగా నెక్కఁగలిగితిమి. పోయినకొలఁది నిడుపుగానుండుటచేఁ బ్రక్కప్రక్కగా నడిపించుచుంటిమి.

మామావులు తావులెఱింగి యొక్కొక్క చోఁ బక్షులవలె నెగురుచు నొక్కచోఁ గోతులవలె దాటుచు నొక్కచోఁ బురుగులవలెఁ బ్రాకుచు మోకాళ్ళ నానియాని డెక్కలఁ జిక్కఁబట్టి క్రోధంబుదెచ్చికొని ప్రోధంబులఁ జఱియలనంటియంటి నడుములువంచి పొదలదూరి