పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/211

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

కాశీమజిలీకథలు - పదియవభాగము.

వీరునిసందిటంబట్టి బుజముపైఁ బెట్టుకొని యెగసిపోవుచుండెను. అంతఃపురస్త్రీ లందరు హాహాకారరవంబులు గావించిరఁట.

అప్పుడా వీరుండు రెండుచేతులు తెగనరికి పారవైచుటయు వాఁడు రెక్కలు విరిగిన పక్షివలె నేలంగూలెను. వానింగాచి తిరుగుచున్న మువ్వురు వీరులు తచ్ఛిరంబు ఖండించి గతాసుగావించిరి. నాలుగవవీరుండు గూడ వారితోఁ గలసికొనియెను. నలుగురు గుఱ్ఱములెక్కి పౌరుల కభయము దెలుపుచు బిమ్మటఁ బెద్ద సత్రమునకుఁబోయిరఁట. రెండువేలభటులతో దండనాథుడు మడసెను. ప్రజలు మూడువేలు నష్టమైనట్లు లెక్కలు తేలినవి. అంతఃపురముల నా వీరులులేకున్న స్త్రీలందరు మడియువారే. మహారాజా! క్షీరాబ్థిలో మొదట హాలాహలము పుట్టి తరువాత నమృతము జనించినట్లు చిలుక నుండి రక్కసుఁడు మహావీరులుగూడ నుదయించిరి. ఇట్టి చోద్య మెన్నఁడును వినియుండలేదు. ఆగుఱ్ఱములునాలుగు నలువురకుఁ బరిచయముగలవివోలె మనసు కనిపెట్టి రెక్కలుగలవివోలె నాదానవుని వెంట నెగయఁ జొచ్చినవి. ఆమహావీరుల దర్శనముజేసి యీజాలా విషయము లన్నియు దేవర తెలిసికొనవలసి యున్నదని మంత్రి యావృత్తాంతమంతయు నెఱింగించెను. ఆకథ విని పృథివీపతి యించుక యాలోచించి కానిమ్ము రేపు మనమందరము వారి బసకరిగి యేనుగనెక్కించి యూరేగింపుచు నింటికిఁ దీసికొనివచ్చి గౌరవింతము గాక. అందులకుఁ దగిన సన్నాహము గావింపుమని నియోగించి సోమదత్తుఁ డంతఃపురమున కరిగెను.

అతనిభార్య సంతోషమిశ్రితమైన శోకమును గద్గదకంఠయై భర్తయొద్దకువచ్చి మేమందరము తల్లికడుపున వెండియుం జనించితిమి. ఆమహావీరుఁ డడ్డపడకున్న నీపాటికి గాటిలో భస్మమైయుందుమని పలుకుచు నచ్చటివృత్తాంతమంతయు నెఱింగించినది. అప్పుడా