పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/210

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మరాక్షసునికథ.

197

పారిపోయి గుప్తస్థలంబులం దాగికొనఁ జొచ్చిరి. అప్పుడా కోయదొర యడ్డుపడకున్న గ్రామమంతయు నరణ్యమైపోవును.

ఆదానవుఁడు కోయదొరను సామాన్యుడనుకొని చులకనగా మీఁదబడి కరవఁబోవుటయు నావీరుండు అడిదంబున వ్రేలాడుచున్న వాని నాలుక రెండుచీలికలుగాఁ గోసి పారవైచెను. అప్పుడువాఁడు వికృతస్వరంబున నార్చుచు నాదొరకు వెరచి వెన్నిచ్చి పాఱఁదొడంగెను. ఆరౌతు విడువక వాని వెన్నంటి తరిమి తరిమి వీధులన్నియుం ద్రిప్పుచు నిలుచుట కవకాశము లేకుండఁ గొట్టుచుండ వాఁడాగ లేక యెగసి మాయింటిగోడ దుమికి లోపలఁ బడియెను.

లోపలివారెల్ల నాక్రందనముసేయుచు గదులలో దూరి తలుపులు వేసికొనుచుండిరి. దేవా! అప్పుడు నేనుగూడ దాగికొనక తీరినదికాదు. మాయింటఁ జిలుక పురుషుఁడై యున్న వీరుండా యలజడి విని జడియక యడిదముగొని వానిందరిమికొని వీధిలోనికిఁ బోయెను. కోయదొర వానికొఱకు గుఱ్ఱముపై వీధిలో నిలువంబడి యుండుటఁజూచి యాదానవుండు వెఱచుచు నెగసి యాప్రాంతమందలి సామంతనృపతి గేహంబునం బ్రవేసించెను.

అందున్న రెండవవీరుఁడు వానిపయింబడి యడిదంబున వాని ముక్కు చెక్కి వీధిలోనికి దరిమివైచెను. కోయదొరయు రెండవవీరుండును గుఱ్ఱములెక్కి వాని వెదకుచు వీధిలో నిలువంబడిరి. మూడవ వీరుండు గూడ వారితోఁ గలసికొని మూడవగుఱ్ఱమెక్కి మువ్వురు వాని నిలువనీయక వేటకుక్కలు మేటి వరాహముంబోలెఁ వెన్నంటి తరుమఁజొచ్చిరి. అప్పుడు వాఁడేమియుం దెఱవుగానక యెగసి దేవర కోటలోబడిఁ దాదులు మొరవెట్ట వాఁడు గాళిందిం బట్టికొని యెత్తుకొనిఁబోవఁ దొడంగుటయు మీయింటనున్న నాలుగవవీరుండు కైదువగొని వాని మీఁదంబడి బాదుటయు వాఁడా చేడియను విడచియా