పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/21

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

కాశీమజిలీకథలు - పదియవభాగము.

పరుండవై మత్కులతంతువులఁ దొంపితివి నిన్నుపేక్షింపరాదు. వినుము. నీవు నాకుఁ బుత్రుఁడవై పుట్టుటయేకాక.

క. కొండెములు సెప్పి నేర్పుగ
   నొండొరులకుఁ దగవుపెట్టు టుచితక్రియగా
   నుండగఁ జగములఁగలహ భు
   జుండని పేర్పొందుదవుర సురమునికోటిన్.

క. నీచెవిఁ బడినరహస్యం
   బేచందంబైన నొరుల కెఱిఁగింపక లో
   దాచినచో నీయుదరము
   వాచు న్వెలిబుచ్చుదనుకఁ బరులెఱుఁగంగన్.

అని శపించి దక్షుం డాక్షణమ బ్రహ్మయొద్దకుంబోయి నారదుండు తనకుఁ గావించిన యపకారప్రకారం బంతయు నెఱింగించిన విని విరించి పరితపించుచు నారదుని రప్పించి యత్యంతకోపముతో,

ఉ. ఏమిరమూఢ ! నాపలుకులెల్ల గణింపక వీటిఁబుచ్చితౌ గా
    మఱి దక్షవుత్త్రులను గన్యకల న్వరియింపకుండ
    దిగ్గాములఁ జేసినాడవఁట కాపురముల్ చెడఁగొట్టవచ్చునే
    నీమది పాపమం చిది గణింపవొ పెద్దలధిక్కరింతువో.

ఏను వాసుదేవునానతింగాదె ప్రజాసర్గంబునకుఁ బూనికొంటి నిష్పని కంతరాయంబు గల్పించుచుంటి విఁక నిన్నుపేక్షింపరాదు. వినుము, నీవు స్థిరయౌవనులగు నేబదుగుర సుందరులకు వల్లభుండవై శృంగారప్రబంధముల రచించుచు శృంగారరసాసక్తిం బ్రవర్తిల్లుచుఁ బూర్వజ్ఞాన మించుకయులేక గాయకులలో నుత్తముఁడవని ప్రఖ్యాతి వడసి చరింతువుగాక. నామాటలు పాటింపనందులకు నీకీపాటిశిక్ష విధింపవలసివచ్చిన"దని శపించిన విని నారదమహర్షి దుఃఖించుచుఁ దండ్రి కిట్లనియె.